Sanchar Saathi App | మొబైల్‌లో సంచార్ సాథీ డిఫాల్ట్‌ యాప్.. యూజర్ల అన్ని కమ్యూనికేషన్లు ప్రభుత్వం చేతిలో?

ఇకపై మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ఇన్ స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని మొబైల్‌ ఫోన్‌ తయారీ కంపెనీలను ఆదేశించినట్టు రాయిటర్స్ కథనం తెలిపింది. అయితే ఈ యాప్ మొబైల్స్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేయడం వల్ల యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై మీడియా నామా ఫౌండర్ ఎడిటర్ నిఖిల్ ఫహువా ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు.

Sanchar Saathi App | మొబైల్‌లో సంచార్ సాథీ డిఫాల్ట్‌ యాప్.. యూజర్ల అన్ని కమ్యూనికేషన్లు ప్రభుత్వం చేతిలో?

Sanchar Saathi App | ఇకపై మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ఇన్ స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని మొబైల్‌ ఫోన్‌ తయారీ కంపెనీలను ఆదేశించినట్టు రాయిటర్స్ కథనం తెలిపింది. అయితే ఈ యాప్ మొబైల్స్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేయడం వల్ల యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై మీడియా నామా ఫౌండర్ ఎడిటర్ నిఖిల్ ఫహువా ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. ఈ యాప్ ఫోన్లలో ఇన్ స్టాల్‌ చేస్తే డిలీట్ చేయడానికి కుదరదు. ఇక భవిష్యత్తులో ఉత్పత్తయ్యే ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ఉండాలని ప్రభుత్వం మొబైల్ కంపెనీలను ఆదేశించింది.

సంచార్ సాథీ యాప్ ఇన్ స్టాల్ చేయడంపై కొన్ని వ్యాఖ్యలు అంటూ నిఖిల్ ఫహువా కొన్ని కామెంట్స్ ఈ పోస్టులో పెట్టారు.

1. సంచార్ సాథీ అనేది కోల్పోయిన ఫోన్ ట్రాకర్. దాన్ని తొలగించే అవకాశం ఉండదు. ఈ యాప్ మీ ఫోన్ లో ఉంటే అది ప్రభుత్వ ట్రాకర్ అవుతుంది. ఒకవేళ ఇది కాకుండా ప్రతి మొబైల్‌లో డిజిటల్ ఐడీ యాప్‌ను బలవంతంగా ఇన్ స్టాల్ చేస్తారా? మీ ఫోన్లో బ్రౌజర్ చరిత్రను ట్రాక్ చేసే యాప్ గా ఇది ప్రతి నెల ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంటుందా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇది ఫోన్ లో ఇన్ స్టాల్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయడం కుదరదు.

2. మీ మొబైల్ ఫోన్ మీ పర్సనల్ వ్యవహారం. లేదా వ్యక్తిగత స్థలం లాంటింది. ఇలాంటి యాప్ ఫోన్‌లో ఉంటే అది మీ వ్యక్తిగతంపై దాడి చేసేందుకేనని వాదించవచ్చు. ఫోన్లలో అత్యంత ప్రైవేట్ సంభాషణలు ఉంటాయి. అత్యంత నమ్మకమైన వ్యక్తులతో సున్నితమైన సమాచారాన్ని మార్పిడి చేసుకొంటాం. ఈ యాప్ మొబైల్స్ లలో ఇన్ స్టాల్ చేస్తే వ్యక్తుల మొబైల్స్ లోని ఫైల్స్, సందేశాలను యాక్సెస్ చేసే అవకాశం ఉండదని గ్యారంటీ ఏంటి అని ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత గోప్యతపై దాడి కిందకు వస్తుందనే అభిప్రాయపడ్డారు.

3. ప్రభుత్వం డేటా రక్షణ చట్టం నుంచి తనను ఎలా మినహాయించుకొందో గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. డేటా రక్షణ చట్టం ప్రైవేట్ కంపెనీలను మరింత జవాబుదారీగా చేస్తుంది. భారత ప్రభుత్వాన్ని తక్కువ జవాబుదారీగా చేస్తుంది.

4. ఇప్పటికే కొన్ని మొబైల్స్ లలో బ్లోట్ వేర్ సమస్యగా ఉంది. ఈ సారి ప్రభుత్వమే బ్లోట్ వేర్ ను బలవంతంగా ఇన్ స్టాల్ చేస్తోంది. మీరు మొబైల్ కొనుగోలు చేస్తున్నప్పుడు బ్లోట్ వేర్ తో కొనాల్సిందే. మనమంతా ఇప్పుడు మన ఫోన్లను రూట్ చేయాల్సి ఉంటుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

5.మొబైల్స్ లో సంచార్ సాథీ యాప్ ఇన్ స్టాల్ చేసే విషయమై ప్రజలతో సంప్రదించలేదు. దీనికి సంబంధించిన ఆర్డర్ బయటకు రాలేదు. ఇది ఒక రకంగా నియంతృత్వ స్వభావమే. ఇది ఇలానే వదిలేస్తే… ఇలాంటివి మరిన్ని వస్తాయి.

5. భారతదేశ టెలికాం శాఖతో విషయాలు పనిచేసే విధానంలో, ప్రజా సంప్రదింపులు లేవు, ఆర్డర్ బహిర్గతం చేయబడలేదు. బలవంతంగా మాత్రమే. ఇది నియంతృత్వ స్వభావం. వారు దీని నుండి తప్పించుకుంటే, మరిన్ని వస్తాయని ఆయన పేర్కొన్నారు.