Bacteria On Your Mobile Screen | మొబైల్ స్క్రీన్‌పై వేల సంఖ్య‌లో బ్యాక్టీరియా.. షాకింగ్ వీడియో

మ‌న జీవితంలో ఓ భాగ‌మైన మొబైల్‌ఫోన్ (Mobile Phone) వ‌ల్ల అనేక‌ ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. రోజంతా చేతిలో ఉండే ఫోన్‌పై వేల సంఖ్యలో బ్యాక్టీరియా (Bacteria On Your Mobile Screen ) ఉంటుందంట‌. మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

Reported by: Tejaswini Nanna | సైన్స్​ – టెక్నాలజీ | Feb 09, 2026, 1:03 pm IST
Read Time: 5 mins
Bacteria On Your Mobile Screen | మొబైల్ స్క్రీన్‌పై వేల సంఖ్య‌లో బ్యాక్టీరియా.. షాకింగ్ వీడియో

Bacteria On Your Mobile Screen | నేటి డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఫోన్ (Mobile Phone) వాడ‌కం పెరిగిపోయింది. ఇది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉద‌యం లేచింది మొద‌లు రాత్రి ప‌డుకునే వ‌ర‌కూ ఫోన్‌కే అతుక్కు పోతున్నాం. మెసేజ్‌లు, వీడియోలు, చాటింగ్‌, కాల్స్‌, రీల్స్ అంటూ గంట‌ల కొద్దీ ఫోన్‌తోనే గ‌డుపుతున్నాం. చివ‌రికి ప‌డుకునేట‌ప్పుడు కూడా ఫోన్‌ను ప‌క్క‌నే పెట్టుకుని నిద్ర‌పోతున్నాం. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఫోన్‌ను మ‌నం ప్రాణం కంటే ఎక్కువ‌గా చూసుకుంటున్నాం. అయితే మ‌న జీవితంలో ఓ భాగ‌మైన ఈ ఫోన్ వ‌ల్ల అనేక‌ ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు (Bacteria On Your Mobile Screen ).

ఫోన్ స్క్రీన్‌పై బ్యాక్టీరియా..

రోజంతా చేతిలో ఉండే ఫోన్‌పై వేల సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుందంట‌. మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. నిరంత‌రం చేతుల‌తో తాక‌డం వ‌ల్ల సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, బాత్రూమ్‌కు వెళ్లేటప్పుడు మొబైల్ వాడటం వల్ల ఇవి సులభంగా శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయ‌ని అధ్య‌య‌నాలు హెచ్చ‌రిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ షాకింగ్‌ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మనం నిత్యం చేతులు కడుక్కుంటాము. కిచెన్‌ని క్లీన్ చేస్తాం. ఇంట్లోని వ‌స్తువుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు డీప్ క్లీన్ చేసుకుంటాం. కానీ ఫోన్‌ను మాత్రం ఒక్క‌సారి కూడా క్లీన్ చెయ్యం. దానివ‌ల్ల ఫోన్‌పై బ్యాక్టీరియా పెరిగిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అందుకే మ‌నం విధిగా ఫోన్‌ను కూడా శుభ్రం చేసుకోవాల‌ని సూచిస్తున్నారు.

ఓ స్మూత్ క్లాత్‌పై 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉన్న ద్రావణాన్ని కొద్దిగా తీసుకుని ఫోన్‌ను శుభ్రం చేస్తే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్‌ను మాత్ర‌మే కాదు, ఫోన్‌కు వేసే క‌వ‌ర్‌ను కూడా క్లీన్ చేయాల‌ని చెబుతున్నారు. ఇలా చిన్ని చిన్న‌పాటి జాగ్ర‌త్త‌లు పాటించి.. ఫోన్‌ను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

No Confidence Motion Against Om Birla : స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాల అవిశ్వాసం ?
Techie safety allegation| కోటి సంపాదించే టెకీ జీవితానికి విలువ ఎక్కడా..?