Vivo V70 FE | 7000mAh బ్యాటరీ, 200మెగాపిక్సెల్ కెమెరాతో వివో మొబైల్.. లాంచ్ ఎప్పుడంటే..!

Vivo V70 FE | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Vivo V70 FEని భారత మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది.

Vivo V70 FE | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Vivo V70 FEని భారత మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ క్రమంలో ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు లీకయ్యాయి. ఈ మొబైల్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుందని తెలియడంతో ఆసక్తి పెరిగిపోతోంది.

కెమెరానే హైలైట్

Vivo V70 FE మోడల్‌పై కెమెరాపైనే వివో కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఫోన్ వెనుక భాగంలో OIS మద్దతుతో కూడిన 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక దీనిలో ఏఐ ఫొటోగ్రఫీ సూట్ ఫీచర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పవర్‌ఫుల్ బ్యాటరీ.. 90W ఫాస్ట్ చార్జింగ్

కెమెరాతో పాటు బ్యాటరీ విషయంలోనూ వివో కంపెనీ రాజీ పడలేదు. ఇందులో 7000mAh భారీ బ్యాటరీని అందించింది. దీనికి తోడు 90W ఫాస్ట్ చార్జింగ్ మద్దతు కూడా లభిస్తుంది. ఇందులో బైపాస్ చార్జింగ్ ఫీచర్‌ కూడా ఉంది. దీనివల్ల గేమింగ్ సమయంలో మొబైల్ వేడెక్కకుండా చల్లగా ఉంచడంలో ఈ ఫీచర్ సహాయపడుతుంది. దీనివల్ల బ్యాటరీ బ్యాకప్ ఎక్కువకాలం వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యమైన స్పెసిఫికేషన్లు

* ఈ మొబైల్ 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో 120Hz రీఫ్రెష్ రేటు అందిస్తుంది. అలాగే 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 449 ppi పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. HDR10+ సపోర్టు చేస్తుంది. దీనివల్ల వీడియోలు చూసినప్పుడు, గేమ్స్ ఆడినప్పుడు లేదా బ్రౌజింగ్ చేసినప్పుడు మెరుగైన అనుభవాన్ని యూజర్లు పొందవచ్చు.

* ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది 4nm ప్రక్రియపై నిర్మించిన మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌ను అమర్చింది. దీనివల్ల మల్టీ టాస్కింగ్‌తోపాటు గేమింగ్ సమయంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
* ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS6పై పనిచేస్తుంది. దీనికి ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను వివో కంపెనీ అందిస్తుంది.
*IP 68, IP 69 రేటింగ్‌తో కూడిన వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
* దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వస్తున్నాయి.

కలర్ ఆప్షన్స్

ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. మాన్‌సూన్ బ్లూ, నార్తర్న్ లైట్స్ పర్‌పుల్ రంగుల్లో వస్తుంది. మాన్‌సూన్ బ్లూ కలర్ వేరియంట్ ఒక ప్రత్యేకమైన డార్క్‌నెస్ గ్లో టెక్నాలజీతో వస్తుంది. అంటే తక్కువ కాంతి ఉన్నప్పుడు ఒక రకంగా, సన్‌లైట్ తగిలినప్పుడు మరో రకంగా మెరుస్తుంది. తద్వారా మొబైల్ డిజైన్ కాస్త ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ధర ఎంత ఉండొచ్చు?

ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం.. రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజి, 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రారంభ ధర రూ37,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇదే ఫోన్ ఇండోనేసియాలో సుమారు రూ.35,600గా ఉండటం గమనార్హం. ఇది గత మోడల్ Vivo V60e ధర (రూ.29,999)తో పోలిస్తే చాలా ఎక్కువ. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది.

Read More:

ఆరేళ్ల ఓఎస్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో.. శాంసంగ్ A సిరీస్‌లో రెండు మిడ్ రేంజ్ ఫోన్లు.. !

సమ్మర్‌లో మీ మొబైల్ ఫోన్ త్వరగా హీటెక్కుతుందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

Latest News