కలియుగ దైవం వేంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం.. ఎందుకంటే..?

హిందూ దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామిని పూజిస్తాము. కోరినవారికి కొంగుబంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు.

కలియుగ దైవం వేంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం.. ఎందుకంటే..?

హిందూ దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామిని పూజిస్తాము. కోరినవారికి కొంగుబంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాందవుడు.. అనాధ రక్షకుడు. మన జీవితంలో శని దేవుడి ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాము. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు అని పండితులు చెబుతున్నారు.

వేంక‌టేశ్వ‌ర‌స్వామికి శ‌నివారం ఎందుకంత ప్రీతి అంటే…

  • ఓంకారం ప్రభవించిన రోజు శనివారం
  • శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం
  • వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం
  • ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం
  • శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే
  • వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే
  • అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం