Australia vs England : హెడ్ సూపర్ సెంచరీ..ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యత

అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ట్రావిస్ హెడ్ (142*) వీరోచిత సెంచరీతో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మూడో రోజు ముగిసే సమయానికి ఆసీస్ 356 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది.

Australia vs England : హెడ్ సూపర్ సెంచరీ..ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యత

విధాత : యాషెస్ సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో అస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 356పరుగుల భారీ ఆధిక్యతతో కొనసాగుతుంది. అసీస్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ(142*; 196 బంతుల్లో, 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) తో పాటు తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అలెక్స్‌ కేరీ (52*; 91 బంతుల్లో, 4 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. అయిదో వికెట్‌కు వారిద్దరు అజేయంగా 175 బంతుల్లో 122 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 66 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ఆసీస్ 356 పరుగుల ఆధిక్యతలో ఉంది.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో జేక్‌ వెదర్లాడ్‌ (1), లబుషేన్‌ (13), కామెరూన్‌ గ్రీన్‌ (7) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఉస్మాన్‌ ఖవాజా (40; 51 బంతుల్లో, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌ 2, బ్రైడర్‌ కార్స్‌, విల్‌ జాక్స్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

అంతకుముందు 213/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ 286 పరుగులకు ఆలౌటైంది. బెన్‌స్టోక్స్‌ (83; 198 బంతుల్లో, 8 ఫోర్లు), జోఫ్రా ఆర్చర్‌ (51; 105 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఆసీస్‌ బౌలర్లలో పాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బోలాండ్ చెరో మూడు, నాథన్‌ లైయన్‌ 2, కామెరూన్‌ గ్రీన్‌, మిచెల్‌ స్టార్క్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి :

Wanaparthy : వనపర్తి కాంగ్రెస్ లో రచ్చ..చిన్నారెడ్డి VS మేఘారెడ్డి
Tollywood Stars | మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నున్న 2025 .. ఈ ఏడాది తల్లిదండ్రులైన టాలీవుడ్ స్టార్స్ వీరే..