Mohsin Naqvi Apologises BCCI | బీసీసీఐకి మోహ్సిన్ నఖ్వీ క్షమాపణలు..!

ఆసియా కప్ వివాదంలో ఏసీసీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ బీసీసీఐకి క్షమాపణలు చెప్పారు, కానీ ట్రోఫీ ఇవ్వడానికి సర్దుబాటు చేయడం లేదు.

Mohsin Naqvi Apologises BCCI | బీసీసీఐకి మోహ్సిన్ నఖ్వీ క్షమాపణలు..!

విధాత : ఆసియా కప్ ట్రోఫీ వివాదంలో ఏసీసీ చీఫ్, పాకిస్తాన్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ వెనక్కి తగ్గారు. టీమిండియాకు అసియా కప్ అందించే విషయమై తన ప్రవర్తన పట్ల నఖ్వీ బీసీసీఔకి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. కప్పు తిరిగిచ్చే విషయంలో మాత్రం నఖ్వీ మొండిగా ఉన్నాడని, సూర్యకుమార్ ఏసీసీ ఆఫీస్‌కు వస్తేనే ట్రోఫీ ఇస్తానని అంటున్నట్లు తెలుస్తోంది.

ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌ విజయం సాధించినప్పటికీ.. ఏసీసీ చీఫ్‌గా ఉన్న మోసిన్‌ నఖ్వీ చేతుల మీదుగా తీసుకొనేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో వాటిని తనతోపాటు ఏసీసీ కార్యాలయానికి నఖ్వీ తీసుకెళ్లారు. ఆసియా కప్‌లో భారత జట్టుకు ట్రోఫీ ప్రదానం చేయకపోవడం పట్ల బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. దీనిపై ఏసీసీ ఏజీఎంలో తన నిరసనను తెలియజేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి నఖ్వీ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. అయితే ట్రోఫీ, మెడల్స్‌ను తనతోపాటు ఉంచుకున్న నఖ్వీ వాటిని భారత్‌కు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించడం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బీసీసీఐకి ఇవ్వకుండా భారత సారథే తన ఆఫీస్‌కు రావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోసారి నఖ్వీ భారత్ కు నచ్చని ప్రతిపాదనే తీసుకురావడంతో ఐసీసీ దృష్టికి తీసుకెళ్లేందుకు బీసీసీఐ సిద్ధమైంది.