Vinesh Phogat | అనర్హత వేటుకు గురైన రెజ్లర్‌ వినేశ్ ఫోగాట్‌పై ఇవాళ తీర్పు..!

Vinesh Phogat | ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్ (Vinesh Phogat) కు రజత పతకం అంశంపై 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)' ఇవాళ తీర్పు ఇవ్వనుంది. శనివారం ఈ కేసు విచారణ జరిపిన సీఏఎస్‌ జడ్జి డాక్టర్‌ అనబెల్లె బెనెట్టే ఆగస్టు 11న తీర్పు ఇస్తామని చెప్పారు.

  • By: Thyagi |    sports |    Published on : Aug 11, 2024 7:22 AM IST
Vinesh Phogat | అనర్హత వేటుకు గురైన రెజ్లర్‌ వినేశ్ ఫోగాట్‌పై ఇవాళ తీర్పు..!

Vinesh Phogat : ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్ (Vinesh Phogat) కు రజత పతకం అంశంపై ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)’ ఇవాళ తీర్పు ఇవ్వనుంది. శనివారం ఈ కేసు విచారణ జరిపిన సీఏఎస్‌ జడ్జి డాక్టర్‌ అనబెల్లె బెనెట్టే ఆగస్టు 11న తీర్పు ఇస్తామని చెప్పారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా 50 కేజీల రెజ్లింగ్‌ ఫైనల్ ఫైట్‌కు దూరమైన ఫోగాట్.. సెమీ ఫైనల్ మ్యాచ్ గెలిచినందుకు తనకు రజత పతకం (Silver Medal) ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది.

దాంతో వినేశ్‌ ఫోగాట్ చేసిన విజ్ఞప్తిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తాత్కాలిక విభాగం విచారణ చేపట్టింది. సెమీస్‌లో తన చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిపి తనకు రజతం ఇవ్వాలని వినేశ్‌ ఫోగాట్ విజ్ఞప్తి చేసింది. వినేశ్ తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా ఆ పతకం వినేశ్‌ కు మాత్రమే చెందాలని వాదించారు. విచారణ తర్వాత సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు భారత ఒలింపిక్‌ సంఘం (IOA), లాయర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ఈ అంశంపై తీర్పు ఆగస్టు 10న ఇస్తామని ముందుగా కోర్టు తెలిపింది. ఆ ప్రకారం శనివారం తీర్పు రావాల్సి ఉంది. కానీ ఇది మళ్ళీ వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితులపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పందిస్తూ.. వినేష్ పట్ల తనకు కచ్చితమైన అవగాహన ఉందన్నారు. ఆమె చిన్న కారణంతో ఫైనల్ పోటీ నుంచి అనర్హతకు గురికావడం తనను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉందని చెప్పారు.