CSK vs PBKS|పంజాబ్ దెబ్బ‌కు చెన్నై విల‌విల‌… త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో విజ‌యం

CSK vs PBKS| ప్ర‌స్తుతం ఐపీఎల్ 2024లో ప్ర‌తి మ్యాచ్ చాలా ఆస‌క్తిక‌రంగా న‌డుస్తుంది.త‌ప్ప‌క గెల‌వాల్సిన స‌మ‌యంలో కొన్ని జ‌ట్లు వీరోచితంగా పోరాడుతున్నాయి.చెన్నై

  • By: sn    sports    May 02, 2024 6:21 AM IST
CSK vs PBKS|పంజాబ్ దెబ్బ‌కు చెన్నై విల‌విల‌… త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో విజ‌యం

CSK vs PBKS| ప్ర‌స్తుతం ఐపీఎల్ 2024లో ప్ర‌తి మ్యాచ్ చాలా ఆస‌క్తిక‌రంగా న‌డుస్తుంది.త‌ప్ప‌క గెల‌వాల్సిన స‌మ‌యంలో కొన్ని జ‌ట్లు వీరోచితంగా పోరాడుతున్నాయి.చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో మంచి విజ‌యాన్ని సాధించింది.ఈ మ్యాచ్‌లో చెన్నై ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు మాత్ర‌మే చేసింది. రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లతో 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజింక్యా రహానే(24 బంతుల్లో 5 ఫోర్లతో 29) మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ ప‌రుగులు చేశారు. పంజాబ్ కింగ్ బౌలింగ్‌కి చెన్నై విల‌విల‌లాడింద‌నే చెప్పాలి. ప‌రుగులు తీయ‌డం వారికి చాలా క‌ష్టంగా మారింది.

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(2/17), రాహుల్ చాహర్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీసారు. ఇక స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన పంజాబ్‌కి శుభారంభం ల‌భించ‌లేదు. నాలుగో ఓవ‌ర్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(13) వికెట్ కోల్పోయింది పంజాబ్. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన రిలీ రోసౌతో కలిసి మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో రెచ్చిపోయి ఆడాడు.. దాంతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఇక ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న స‌మ‌యంలో జానీ బెయిర్ స్టోను (30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 46) శివమ్ దూబే కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. ఆ కొద్దిసేపటికే రీలీ రోసౌ‌ను(23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్, సామ్ కరణ్ ఆచితూచి ఆడారు.

ఇక చివ‌రలో స‌మీక‌ర‌ణం పంజాబ్ విజయానికి 24 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా.. ముస్తాఫిజుర్ వేసిన 17వ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. ఇక రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్‌లో బౌండరీ బాదగా.. శశాంక్ సింగ్ క్విక్ డబుల్‌తో పంజాబ్ జ‌ట్టుకి విజ‌యాన్ని అందించిపెట్టాడు. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు అలాగే ఉన్నాయి. 4 విజయాలతో ఆ జట్టు 8 పాయింట్లు సాధించింది. జట్టు 7వ స్థానానికి చేరుకుంది.