MS Dhoni|ధోని స్టంప్స్ లవ్ స్టోరీ గురించి తెలుసా? విజయం తర్వాత స్టంప్స్ ను ఎందుకు తీసుకెళతాడు అంటే..!
MS Dhoni| ప్రపంచ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోని పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. కెప్టెన్‌గా, అత్యుత్తమ వికెట్ కీపర్‌గా ధోనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత్‌కి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని అత్యుత్తమ ఫినిషర్‌గా చరిత్రలో నిలిచాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ప్రశాంతంగా ఎదుర్కొని జట్టు

MS Dhoni| ప్రపంచ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోని పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. కెప్టెన్‌గా, అత్యుత్తమ వికెట్ కీపర్‌గా ధోనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత్‌కి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని అత్యుత్తమ ఫినిషర్‌గా చరిత్రలో నిలిచాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ప్రశాంతంగా ఎదుర్కొని జట్టుకు విజయాలు అందించి ‘మిస్టర్ కూల్’గా ప్రసిద్ధి చెందాడు. అయితే మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని ఎవరైన భర్తీ చేస్తారా అంటే దాని గురించి కచ్చితమైన క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. ధోని 2011 వన్డే వరల్డ్ కప్ తో పాటుగా 2007 టీ20 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను అందించి అరుదైన ఘనత సాధించారు. అయితే మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించినప్పుడు కూడా ధోని సెలబ్రేషన్స్ మాములుగానే ఉన్నాయి.
అందరి ఆటగాళ్ల మాదిరిగా గట్టిగా ఎగరడం, గంతులు వేయడం వంటివి చేయడు. కాకపోతే విజయం తర్వాత స్టంప్స్ ను తనతో పాటుగా తీసుకెళ్తాడు. చాలా మ్యాచ్ ల్లో ఇది చూసే ఉన్నాం. అయితే ఇలా స్టంప్స్ తీసుకెళ్లి ధోని ఏం చేస్తాడు? అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో ధోని సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ గెలిచిన సందర్భంగా, గుర్తుగా నేను స్టంప్స్ ను తీసుకెళ్తాను. ఆ మ్యాచ్ లో మేం ఎలా పోరాడాం? ఎలా రెడీ అయ్యాం? అన్న విషయాలు గుర్తుంచుకోవడానికి ఇలా చేస్తాను. మా ఇంటిలో వీటిని భద్రపరచడానికి ప్రత్యేక ప్లేస్ ఉంది అని ధోని చెప్పుకురాగా, ఇన్నాళ్లకి అసలు సీక్రెట్ బయటపడింది. అయితే 2015లో ప్లేయర్లు ఇలా స్టంప్స్ తీసుకెళ్లకుండా ఐసీసీ నిషేధం విధించింది. లక్షలు పోసి లెడ్ స్టంప్స్ ను తీసుకొచ్చిన దగ్గర నుంచి ఐసీసీ ఈ నిబంధన తీసుకొచ్చింది.
జ్ఞాపకాల కోసం స్టంప్స్‌ను తీసుకెళ్లాలనుకునే ధోనీకి ఐసీసీ విధించిన రూల్ ఓ సమస్యగా మారింది. దీంతో ఐసీసీని ధోనీ ఓ ప్రత్యేక అభ్యర్థన కూడా చేశాడంట. ఆటగాళ్ల కోసం చెక్కతో చేసిన స్టంప్స్‌ను అందుబాటులో ఉంచాలని ధోనీ అడిగాడని, కానీ ఐసీసీ సానుకూలంగా స్పందించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌కి దూరంగా ఉన్న ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ సీజన్ ఆడతాడా లేదంటే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.