Telangana Awards: తెలంగాణ ఉద్యమకారులకు కోటి నజరానాలు!

విధాత, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో తమ రచనలు, పాటలతో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా నగదు నజరానాలు అందించింది. పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాలను సీఎం రేవంత్ రెడ్డి అందచేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను కదిలించిన కవులు కళాకారులు సాహితీవేత్తలు తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ మేరకు ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరిలకు, దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరిల కుటుంబ సభ్యులకు నగదు పురస్కారాన్ని అందించారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కూతురికి నగదు పురస్కారాన్ని అందించారు. బహు బాషా సాహితీ వేత్త నలిమెల భాస్కర్ కు సీఎం రేవంత్ రెడ్డి కాళోజీ పురస్కారం అందించారు.