Cricket | మెన్ క్రికెట్ వర్సెస్ ఉమెన్ క్రికెట్.. ఆటలో ఉన్న తేడాలు మీకు తెలుసా?

క్రికెట్ గేమ్ లో అంతర్జాతీయంగా పురుషులకు, మహిళలకు కొన్ని తేడాలు ఉంటాయి. వీటి వల్ల మహిళలకు కొన్ని ఉపయోగాలు ఉంటాయని, ఈ నిర్ణయం వల్ల మహిళల అభివృద్ధికి తోడ్పాటుని అందిస్తుందని చెబుతున్నారు.

  • By: chinna |    sports |    Published on : Nov 04, 2025 7:23 PM IST
Cricket | మెన్ క్రికెట్ వర్సెస్ ఉమెన్ క్రికెట్.. ఆటలో ఉన్న తేడాలు మీకు తెలుసా?

విధాత, హైదరాబాద్ :

భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. భావోద్వేగం. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు కుదిరితే లైవ్ లో చూడడానికి స్టేడియానికి వెళ్లడం లేకపోతే టీవీకి అతుక్కుని మ్యాచ్ అయిపోయే వరకు చూడడం సాధారణమైన విషయం. ఇక మైదానంలో జరిగే ప్రతి మూవ్‌మెంట్ కు ఫ్యాన్స్ ఎక్స్ ప్రెషన్స్ అంతా ఇంతా కావు. బౌండరీ, ప్రతి వికెట్‌, ప్రతి సిక్స్‌కు కోట్లాది గుండెలు దడపడతాయి. అయితే, ఇప్పటి వరకు ఈ ఉత్సాహం ప్రధానంగా పురుషుల క్రికెట్‌ చుట్టే తిరిగేది. కానీ ఇప్పుడిప్పుడే అది మహిళల క్రికెట్‌ కు కూడా ఇదే కొనసాగుతోంది. తాజాగా, ఉమెన్స్ వరల్డ్‌కప్ విజయం తో మహిళా క్రికెట్‌పై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ప్రపంచకప్ మ్యాచ్‌లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్యే దానికి నిదర్శనంగా నిలుస్తోందంటున్నారు.

ఆటలో తేడా ఎక్కడుంది?

క్రికెట్ గేమ్ లో అంతర్జాతీయంగా పురుషులకు, మహిళలకు కొన్ని తేడాలు ఉంటాయి. వీటి వల్ల మహిళలకు కొన్ని ఉపయోగాలు ఉంటాయని, ఈ నిర్ణయం వల్ల మహిళల అభివృద్ధికి తోడ్పాటుని అందిస్తుందని చెబుతున్నారు. నిబంధనల పరంగా చూస్తే పెద్దగా తేడాలు కనిపించవు.. కానీ కొన్ని టెక్నికల్‌ అంశాల్లో మాత్రం తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. బంతి బరువు నుంచి బౌండరీ దూరం వరకు ప్రతి దాంట్లో కొన్ని తేడాలు ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అందులో బాల్ సైజు, బరువు విషయంలో చూస్తే మహిళల క్రికెట్ లో- 140–151 గ్రాములు ఉంటే పురుషులకు- 155.9–163 గ్రాముల వరకు ఉంటుంది. కాగా, బ్యాట్ విషయంలో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవని ఒకే రకమైన బ్యాట్లు వాడుతారని చెబుతున్నారు. అలాగే, మ్యాచ్ టైమింగ్ కు వస్తే మహిళల వన్డే ఇన్నింగ్స్‌ 3 గంటల 10 నిమిషాల్లో ముగించాల్సి ఉండగా.. 3 గంటల 30 నిమిషాల సమయంలో మెన్స్ వన్డే ఇన్నింగ్ ముగించాల్సి ఉంటుంది. ఓవర్ రేట్ కూడా ఉమెన్స్ మ్యాచ్ ల్లో వేగంగా ఉంటుంది.

బౌండరీల దూరానికి వస్తే ఉమెన్స్ మ్యాచుల్లో పిచ్ సెంటర్ నుంచి 60–70 గజాల దూరం ఉండాలి. మెన్స్ మ్యాచుల్లో 65–90 గజాల దూరం ఉంటుంది. దీనిపై మ్యాచ్ ముందు అంపైర్లు, రిఫరీలు నిర్ణయం తీసుకుంటారు. పవర్ ప్లే విషయానికి వస్తే మెన్స్‌ క్రికెట్‌ లో మూడు పవర్‌ప్లే దశలు.. ఉమెన్స్ క్రికెట్ లో ఒకే పవర్ ప్లే (1-10 ఓవర్ల మధ్య) ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ వ్యవధికి వస్తే మెన్స్ కు కచ్చితంగా 5 రోజుల పాటు నిర్వహిస్తారు. వీరికి రోజుకు 100 ఓవర్లు వేయాలనే నిబంధన ఉంటుంది. మహిళలకు అయితే 4 లేదా 5 రోజుల పాటు ఉండగా వీరికి రోజుకు 90 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. కాగా, మహిళల క్రికెట్‌ ఇక ‘పురుషుల ఆటకు ప్రత్యామ్నాయం’ కాదని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. అలాగే, మహిళా క్రికెట్ స్వతంత్ర స్థాయికి ఎదుగుతోంది. బీసీసీఐ సాంకేతికంగా సవరణలు చేస్తుండగా, అభిమానుల ప్రేమ కూడా రోజురోజుకు పెరుగుతోంది.