Gambhir| అదే నా ల‌క్ష్యం అంటున్న న‌యా కోచ్.. జీతం ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..!

Gambhir| రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో భార‌త క్రికెట్ జ‌ట్టు కొత్త కోచ్‌గా ఎవ‌రు ఎంపిక అవుతారు అనే స‌స్పెన్స్ కి తెర‌దించుతూ జూలై 9న‌ టీమిం

  • By: sn    sports    Jul 10, 2024 7:38 AM IST
Gambhir| అదే నా ల‌క్ష్యం అంటున్న న‌యా కోచ్.. జీతం ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..!

Gambhir| రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో భార‌త క్రికెట్ జ‌ట్టు కొత్త కోచ్‌గా ఎవ‌రు ఎంపిక అవుతారు అనే స‌స్పెన్స్ కి తెర‌దించుతూ జూలై 9న‌ టీమిండియా హెడ్ కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడ‌ని బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో గౌత‌మ్ గంభీర్ ఆనందం వ్య‌క్తం చేశాడు. ఒకప్పుడు భారత్‍కు ఆటగాడిగా చాలా విజయాలు అందించిన గంభీర్ ఇప్పుడు టీమిండియాలో త‌న‌ది డిఫ‌రెంట్ రోల్ అని చెప్పుకొచ్చాడు. త్రివ‌ర్ణ ప‌తాకం త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. భారతీయులందరినీ గర్వించేలా చేయడమే గోల్ అంటూ కామెంట్ చేశాడు.

140 కోట్ల భారతీయుల కలలను టీమిండియా భుజాన మోస్తోంది. ఇప్పుడు ఆ కలలను సాకారం చేసేందుకు నేను నా శక్తిమేర కృషి చేస్తాను అని గౌత‌మ్ గంభీర్ స్ప‌ష్టం చేశాడు. అయితే హెడ్ కోచ్ ప‌ద‌వికి గంభీర్ భారీగానే డిమాండ్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. గంతంలో రాహుల్ ద్రవిడ్ ఏడాదికి రూ.12 కోట్ల జీతాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు అంత క‌న్నా ఎక్కువ మొత్తంలో గంభీర్ డిమాండ్ చేసిన‌ట్టు సమాచారం. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు.ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ కాబ‌ట్టి ఐపీఎల్ వంటి ఖరీదైన లీగుల్లో గంభీర్ ప్రాతినిథ్యం వహించే అవ‌కాశం లేదు. కేకేఆర్ మెంటార్ పదవికి కూడా గంభీర్ గుడ్ బై చెప్పేశాడు. మరి ఈ లెక్క‌లన్నీ ఆలోచించే గంభీర్ బీసీసీఐని భారీగా జీతం డిమాండ్ చేసి ఉండ‌టాడ‌ని నేష‌న‌ల్ మీడియా తెలియ‌జేసింది.

ఇక గంభీర్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కోచ్‌గా గంభీర్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. ప్ర‌స్తుతం టీమిండియా జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉంది. ఇది ఆదివారంతో ముగుస్తుంది. తాత్కాలిక కోచ్‌ వీవీఎస్ లక్ష్మణ్, శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేకు వెళ్లిన భారత యువ జట్టు మ‌రో వారంలో స్వ‌దేశంకి రానుంది. ఇక నెలాఖ‌రులో శ్రీలంక ప‌ర్య‌ట‌న ఉంది. శ్రీలంక పర్యటనతో భారత జట్టు హెడ్ కోచ్‍గా తన ప్రస్థానాన్ని గౌతమ్ గంభీర్ మొదలుపెట్టనున్నాడు.