Gambhir| గంభీర్ ఎంట్రీ త‌ర్వాత మారిన ప‌రిస్థితులు.. టీమిండియా ఖాతాలో అన్ని చెత్త రికార్డులే..!

Gambhir| సొంత గ్రౌండ్‌లో భార‌త్ వ‌రుస‌గా రెండు టెస్ట్‌లు ఒడిపోవ‌డంతో ఇప్పుడు అంతా జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు టీమిండియా ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్‌ని తిట్టిపోస్తున్నారు. గంభీర్ వ‌చ్చాక టీమిండియా జ‌ట్టు అద్భుతంగా రాణించ‌లేక‌పోతుంద‌ని అంటున్నారు. గౌతమ్ గంభీర్ జట్టు ప్రధాన కోచ్ అయిన తర్వా

  • By: sn    sports    Oct 27, 2024 11:56 AM IST
Gambhir| గంభీర్ ఎంట్రీ త‌ర్వాత మారిన ప‌రిస్థితులు.. టీమిండియా ఖాతాలో అన్ని చెత్త రికార్డులే..!

Gambhir| సొంత గ్రౌండ్‌లో భార‌త్ వ‌రుస‌గా రెండు టెస్ట్‌లు ఒడిపోవ‌డంతో ఇప్పుడు అంతా జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు టీమిండియా ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్‌ని తిట్టిపోస్తున్నారు. గంభీర్ (Gambhir)వ‌చ్చాక టీమిండియా జ‌ట్టు అద్భుతంగా రాణించ‌లేక‌పోతుంద‌ని అంటున్నారు. గౌతమ్ గంభీర్ జట్టు ప్రధాన కోచ్ అయిన తర్వాత, టీమిండియా చాలా అవమానకరమైన పరాజయాలను చవిచూసింది. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా శ్రీలంకలో తన మొదటి విదేశీ పర్యటన చేశాడు. అతని హయాంలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమ్ ఇండియా శుభారంభం అందించి, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో ఘోర పరాజయం పాలైంది.

శ్రీలంకతో జరిగిన ఈ వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా చిత్తుగా ఓడిపోవ‌డంతో భార‌త అభిమానుల కోపం క‌ట్టలు తెచ్చుకుంది. గత 45 ఏళ్లలో భారత జట్టు ఏడాది వ్యవధిలో వన్డే గెలవలేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పుడు న్యూజిలాండ్‌పై కూడా టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన కొనసాగడంతో బెంగళూరు వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా(India) ఓటమి పాలైంది. తొటి టెస్ట్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో అయితే కేవ‌లం 46 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్ అయింది. ఇక 36 ఏళ్ల తర్వాత స్వదేశంలో టీమ్ ఇండియా న్యూజిలాండ్ చేతిలో చెత్త‌గా ఓడి స‌రికొత్త రికార్డ్ లిఖించింది. ఇంతకు ముందు 1988లో న్యూజిలాండ్ భారత్‌లో టెస్టు గెలిచింది.

ఇలా టీమిండియా వ‌రుస ప‌రాజ‌యాల‌తో పాటు చెత్త రికార్డులు టీమిండియాని ఎంత‌గానో క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. గంభీర్ వ‌చ్చాక టీమిండియా ప‌రిస్థితి ఇంత చెత్త‌గా మారింద‌ని అంటున్నారు. బెంగళూరు, పుణెలలో విజయం సాధించి న్యూజిలాండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత్‌లో న్యూజిలాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఇప్పుడు ముంబైలో జరిగే మూడో మ్యాచ్ సిరీస్ ఫలితాలను ప్రభావితం చేయదు. అయితే, ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC ఫైనల్)కి చాలా ముఖ్యమైనది. ఇటువంటి పరిస్థితిలో టీమిండియా బలమైన పునరాగమనంపై దృష్టి పెడుతుంది.12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత క్రికెట్ జట్టు శుక్రవారం (నవంబర్ 1) నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకోవడానికి ఎంతో కీలకం కానుంది