Olympics 2024 | నిరాశ మిగిల్చిన టీమిండియా.. సెమీస్‌లో జర్మనీపై భారత జట్టు పరాజయం
Olympics 2024 | పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలను మాత్రమే సాధించింది. ఇందులో మూడు కాంస్య పతకాలున్నాయి. అయితే, భారత హాకీ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకుపోవడంతో జట్టుపై భారీగానే అభిమానులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి.
Olympics 2024 | పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలను మాత్రమే సాధించింది. ఇందులో మూడు కాంస్య పతకాలున్నాయి. అయితే, భారత హాకీ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకుపోవడంతో జట్టుపై భారీగానే అభిమానులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. సెమీఫైనల్ పోరులో జర్మనీపై భారత హాకీ జట్టు పరాజయం పాలైంది. 3-2 తేడాతో భారత్ ఓటమిని మూటగట్టుకున్నది. హాకీలో పతకం ఖాయమని అభిమానులు ఆశించగా.. ఓటమితో మరోసారి నిరాశ తప్పలేదు. మ్యాచ్ 54వ నిమిషంలో గొంజాలో సహకారంతో జర్మనీ ప్లేయర్ మార్కో మిల్ట్‌కౌ సాధించిన నిర్ణయాత్మక గోల్ సాధించడంతో పాటు ఫలితం మొత్తం మారిపోయింది. అదే సమయంలో మ్యాచ్ ఆద్యాంతం మైదానంలో జర్మనీ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనిపించారు. మ్యాచ్‌లో గోల్ కోసం చివరి 5 నిమిషాల్లో భారత ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించిన కలిసిరాలేదు. హార్దిక్ సింగ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేష్ భారమైన హృదయాలతో కనిపించారు. ఈ సారి గోల్డ్ మెడల్‌ని నెగ్గాలని భావించినా సెమీస్‌లో ఓటమితో ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.
శుభారంభం చేసినా..
జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా శుభారంభం చేసింది. చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయింది. తొలి క్వార్టర్‌లో జర్మనీపై టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత జర్మనీ పుంజుకొని అద్భుత ప్రదర్శన కనబరిచి సెమీఫైనల్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. తొలి క్వార్టర్‌లో భారత హాకీ జట్టు మంచి లయను కనబరుస్తూ.. అటాకింగ్‌గా ఆడింది. దాంతో జర్మనీ జట్టు కొంత ఒత్తిడికి గురైంది. తర్వాత టీమిండియా డిఫెన్సివ్ మోడల్‌లోకి వెళ్లింది. ఇదే టీమిండియా కొంపముంచింది. దాన్ని పసిగట్టిన జర్మనీ ఆటాకింగ్ మొదలుపెట్టింది. రెండో క్వార్టర్‌లో జర్మనీ రెండు గోల్స్ సాధించింది. మరో వైపు సెమీ ఫైనల్‌లో కీలక ఆటగాడు అమిత్ రోహిత్‌దాస్ దూరమయ్యాడు. నిజానికి క్వార్టర్ ఫైనల్స్‌లో అమిత్‌కి రెడ్ కార్డ్ పడింది. ఆ తర్వాత ఒక మ్యాచ్ నిషేధం కూడా పడింది. అమిత్ మ్యాచ్‌లో ఉన్న సమయంలో జట్టు డిఫెన్స్ పటిష్టంగా కనిపించింది. ఇక టీమిండియా కాంస్య పతకం కోసం స్పెయిన్‌తో మ్యాచ్ ఆడనున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram