Hardik Pandya| హార్దిక్ పాండ్యా విధ్వంసక శతకం

టీమీండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విజయ్ హజారే టోర్నీలో విధ్వంసక శతకంతో వీరవిహారం చేశాడు. కేవలం 63బంతుల్లో శతకం పూర్తి చేసిన పాండ్యా ఒకే ఓవర్ లో వరుసగా 5సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి సంచలనం సృష్టించాడు.

Hardik Pandya| హార్దిక్ పాండ్యా విధ్వంసక శతకం

Baroda vs Vidarbha : టీమీండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) విజయ్ హజారే టోర్నీ(Vijay Hazare Trophy)లో విధ్వంసక శతకం(destructive century)తో వీరవిహారం చేశాడు. కేవలం 63బంతుల్లో శతకం పూర్తి చేసిన పాండ్యా ఒకే ఓవర్ లో వరుసగా 5సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి సంచలనం సృష్టించాడు. 92బంతుల్లో 133 పరుగులు(8ఫోర్లు, 11సిక్సర్లు) సాధించడంతో బరోడా ముందుగా బ్యాటింగ్ చేసి 50ఓవర్లలో 293/9 పరుగులు సాధించింది.

బరోడా ఇన్నింగ్స్ లో మిగతా బ్యాటర్లు అంతా విఫలమైన చోట పాండ్యా సిక్సర్లు, ఫోర్లతో సెంచరీ నమోదు చేయడం విశేషం. హర్థీక్ తర్వాత విష్ణు సోలంకీ చేసిన 26పరుగులే అత్యధికం. విదర్భ బ్యాటర్లు కొట్టిన 12సిక్సర్లలో పాండ్యా కొట్టిన సిక్స్ లు 11 ఉన్న తీరు అతడి ధనాధన్ బ్యాటింగ్ కు నిదర్శనం. ఓ దశలో 62బంతుల్లో 66పరుగులతో ఉన్న హార్దిక్ పాండ్యా వరుసగా పార్థ్ రెక్డే వేసిన ఓవర్ ఆరు బంతుల్లో 5సిక్స్ లు, 4ఫోర్ తో శతకాన్ని పూర్తి చేయడం విశేషం. విదర్బ బౌలర్లలో యష్ ఠాకూర్ 4వికెట్లు సాధించాడు. 294పరుగుల లక్ష్య చేధన కోసం విదర్బ బ్యాటింగ్ కొనసాగిస్తున్నది.