IND vs ZIM| ఇది గమనించారా.. ఐదో టీ20లో ఒక్క బంతికే 13 పరుగులు రాబట్టిన జైస్వాల్.. ఇదెలా సాధ్యం
IND vs ZIM| జింబాబ్వే పర్యటనని టీమిండియా జట్టు సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లలో భారత్ ఒక్కటి ఓడిపోయి మిగతా అన్ని మ్యాచ్‌లలోను మంచి విజయాలు సాధించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో టీమిం

IND vs ZIM| జింబాబ్వే పర్యటనని టీమిండియా జట్టు సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లలో భారత్ ఒక్కటి ఓడిపోయి మిగతా అన్ని మ్యాచ్‌లలోను మంచి విజయాలు సాధించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో ముఖేష్ కుమార్(4/22) సంచలన ప్రదర్శనతో టీమిండియా సులువైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. శివమ్ దూబే(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) చివర్లో మెరుపులు మెరిపించాడు.
టీమిండియా తొలి ఓవర్‌లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. అతను సికందర్ రజా బౌలింగ్‌లో ఔట్ కాగా, అంతకముందు తొలి ఓవర్ తొలి బంతికి 13 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఓవర్ లోనే జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ చేయగా,అతను వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టాడు జైస్వాల్. అయితే అది నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ అవకాశం దక్కింది. మళ్లీ జైస్వాల్ భారీ సిక్సర్ బాదాడు. ఇలా 1 బంతికి రెండు సిక్సర్లు, ఒక ఎక్స్‌ట్రా రన్ కలుపుకొని మొత్తం 13 పరుగులు చేశాడు. ఆ తర్వాత, అదే ఓవర్ నాలుగో బంతికి సికిందర్ రాజా అతనిని బౌల్డ్ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని రెండు వికెట్లు తీయగా.. సికందర్ రాజా, బ్రాండన్ మవుతా తలో వికెట్ తీసారు.
168 పరుగుల లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వేకు తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయి కష్టాలలో పడింది. ఓపెనర్ వెస్లీ మధెవెరె(0)ను ముఖేష్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్‌లో బ్రియాన్ బెన్నెట్‌ను ముకేష్ పెవీలియన్‌కి పంపాడు. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ ఆచితూచి ఆడారు. డియోన్ మైర్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 34), మరుమని(24 బంతుల్లో 5 ఫోర్లతో 27), ఫరాజ్ అక్రమ్(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) కీలకమైన పరుగులు చేసిన కూడా తమ జట్టుని గెలిపించడంలో విఫలం అయ్యారు. ఇక దూబేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.