INDIA| రోహిత్‌- కోహ్లీ అంత పెద్ద త‌ప్పు చేశారా.. దేశం ప‌రువు పోతే రెస్పాన్సిబిలిటీ ఎవ‌రిది?

INDIA|  ప్ర‌స్తుతం టీమిండియా జ‌ట్టులో సీనియ‌ర్స్ ఆట‌గాళ్లుగా ఉన్నారు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ. ఈ ఇద్ద‌రు కూడా అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో విలువైన ప‌రుగులు చేసి టీమిండియాకి ఎన్నో మంచి విజ‌యాలు అందించారు. ఇటీవ‌ల జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కూడా ఈ ఇద్ద‌రు అవ‌స‌ర‌మైన స‌మ‌యాల‌లో కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌డం మ‌నం చూశాం. అయితే టీ20 వర‌ల్డ్ క‌ప్ ద‌క్క‌డంతో రోహిత్‌, కోహ్లీలు టీ20 క్రికెట్‌కి గుడ్ బై చెప్పారు. కాస్త క‌ష్ట‌మైన కూడా బాధ‌ని దిగ‌మిం

  • By: sn    sports    Jul 07, 2024 7:37 AM IST
INDIA| రోహిత్‌- కోహ్లీ అంత పెద్ద త‌ప్పు చేశారా.. దేశం ప‌రువు పోతే రెస్పాన్సిబిలిటీ ఎవ‌రిది?

INDIA|  ప్ర‌స్తుతం టీమిండియా జ‌ట్టులో సీనియ‌ర్స్ ఆట‌గాళ్లుగా ఉన్నారు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ. ఈ ఇద్ద‌రు కూడా అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో విలువైన ప‌రుగులు చేసి టీమిండియాకి ఎన్నో మంచి విజ‌యాలు అందించారు. ఇటీవ‌ల జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కూడా ఈ ఇద్ద‌రు అవ‌స‌ర‌మైన స‌మ‌యాల‌లో కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌డం మ‌నం చూశాం. అయితే టీ20 వర‌ల్డ్ క‌ప్ ద‌క్క‌డంతో రోహిత్‌, కోహ్లీలు టీ20 క్రికెట్‌కి గుడ్ బై చెప్పారు. కాస్త క‌ష్ట‌మైన కూడా బాధ‌ని దిగ‌మింగుకొని టీ20 క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించారు. ఇక నుండి వారిద్ద‌రు కేవ‌లం వ‌న్డే, టెస్ట్ మ్యాచ్‌ల‌లో మాత్ర‌మే క‌నిపించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నుంది, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్ ఉన్నాయి. ఈ రెండింటిలోను విజ‌యం సాధించి ట్రోఫీలు నెగ్గి త‌మ కెరీర్ చిర‌స్మ‌ర‌ణీయంగా మార్చుకోవాల‌ని ఈ ఇద్దరు భావిస్తున్నారు.

అయితే కుర్రాళ్ల కోసం రోహిత్‌- విరాట్‌లు టీ20 క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌గా, యంగ్‌స్ట‌ర్స్ దేశం ప‌రువు తీసేలా క‌నిపిస్తున్నార‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా జింబాబ్వే తో టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధ‌మైంది. సీనియ‌ర్ల గైర్హాజ‌రీలో యువ‌కుల‌తో కూడిన టీమిండియా గ‌త రాత్రి జింబాబ్వేతో తొలి టీ20 ఆడింది. శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్‌గా ఉండ‌గా, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధృవ్ జురెల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లు జ‌ట్టులో ఛాన్స్ ద‌క్కించుకున్నారు. అయితే జింబాబ్వేపై సులువుగా గెలుస్తార‌ని అంద‌రు భావించ‌గా, 115 ప‌రుగుల టార్గెట్ కూడా చేజ్ చేయ‌లేక బొక్క‌బోర్లా ప‌డ్డారు.

టీమిండియా జ‌ట్టులో ఒక్క గిల్ (31), వాషింగ్ట‌న్ సుంద‌ర్(27) తప్పితే ఇంకెవరూ కూడా పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. న‌లుగురు బ్యాట్స్‌మెన్స్ డకౌట్ అయ్యారు. ఈ క్ర‌మంలో భార‌త్ 13 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. నిన్నటి వరకు టీ20 వరల్డ్ కప్ గెలిచామని అందరమూ సంబురపడ్డాం.. కాని ఇప్పుడు ప‌సికూన చేతిలో ఓడాం. ట్రోఫీ కూడా పోతే దేశం ప‌రువు ఏం కావాలి. చిన్న జ‌ట్ల‌పై కూడా గెల‌వ‌లేని ఈ యంగ్‌స్ట‌ర్స్ కోసం రోహిత్‌- కోహ్లీలు త్యాగం చేశారా అంటూ కొంద‌రు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. రోహిత్-కోహ్లీ ఈజీగా ఇంకో రెండేళ్లు ఆడి యంగ్​స్టర్స్​ను గైడ్ చేస్తే బాగుండేద‌ని కొంద‌రు స‌ల‌హాలు ఇస్తున్నారు.