Team India | శుభమన్‌గిల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ – ఇంగ్లండ్‌పై భారత్ పైచేయి
Team India | ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు పూర్తిగా భారత్‌కు అనుకూలంగా నిలిచింది. శుభమన్‌గిల్ తన కెరీర్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో 269 పరుగులు చేసి, భారత్‌ను భారీ స్కోరు వైపు నడిపించాడు. ఇదే ఆయన టెస్టు కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ఆ ఇన్నింగ్స్‌లోనే గిల్ 250కి పైగా పరుగులతో తొలి స్కోరును కూడా నమోదు చేశాడు. గిల్ ఇన్నింగ్స్‌తో ఉత్సాహం పొందిన భారత జట్టు మిగిలిన భాగస్వామ్యాల ద్వారా స్కోరును పెంచుతూ తొలి ఇన్నింగ్స్‌ను 587 పరుగుల వద్ద ముగించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారత బ్యాటర్లు ఆడుతూ పాడుతూ ఇంగ్లండ్ బౌలింగ్‌ను కష్టాల్లోకి నెట్టారు.

- ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ రెండో రోజు
- భారత్ తొలి ఇన్నింగ్స్ 587
- ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 77 / 3
Team India | భారత బ్యాటింగ్‌కు ధీటుగా ప్రత్యర్థి బౌలింగ్‌లో ఎలాంటి ప్రభావం లేకపోవడంతో దెబ్బతిన్నది. దీంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఎదుర్కొనాల్సిన ఇంగ్లండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లోనూతేలిపోయింది. ముఖ్యంగా బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్ తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లను సాధించి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. వరుస బంతుల్లో బెన్ డకెట్, ఓలీ పోప్‌ను పెవిలియన్‌కు పంపిన ఆకాశ్ దీప్ అదరగొట్టాడు. ఓలీ పోప్ గోల్డెన్ డకెట్‌గా వెనుదిరగడం విశేషం.ఆ తర్వాత మొహమ్మద్ సిరాజ్ కూడారంగంలోకిదిగి జాక్ క్రాలీని ఔట్ చేసి మూడో వికెట్‌ను భారత్‌కు అందించాడు. ఇలా ఒక దశలో ఇంగ్లండ్ 47 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే చివర్లో జో రూట్ (18), హ్యారీ బ్రూక్ (30) లాంటి కీలక బ్యాటర్లు క్రీజులో నిలిచి వన్డే మాదిరిగా కొన్ని బౌండరీలతో స్కోరును వేగంగా నడిపారు. చివరకు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 77 పరుగులకు మూడు వికెట్లతో నిలిచింది.
ఈస్కోర్లతో రెండో రోజు పూర్తి స్థాయిలో భారత్‌కే అనుకూలంగా ముగిసిందని చెప్పొచ్చు. ముందు 550కి పైగా పరుగుల భారీ స్కోరు చేసి, తర్వాత ప్రత్యర్థి మొదటి మూడు వికెట్లు త్వరగా పడగొట్టిన భారత జట్టు తన పూర్తి ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. ప్రస్తుతం క్రీజులో ఇంగ్లండ్ కీలక బ్యాటర్లు జో రూట్, హ్యారీ బ్రూక్ ఉన్నా, భారత్ బౌలింగ్‌ను ఎదుర్కొనే బాధ్యత వారిపైనే ఉంది.రేపు తొలి గంట కీలకం కానుంది.మూడో రోజు తొలి సెషన్ మ్యాచ్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పుంజుకుంటుందా? లేక భారత్ ఆధిక్యతను మరింతపెంచుతుందా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
మూడో రోజు తొలి సెషన్ కీలకం కానుంది. ఇంగ్లండ్ పోరాడతుందా? లేక భారత్ విజయం వైపు ముందడుగు వేస్తుందా? – ఆసక్తిగా ఎదురుచూద్దాం!