Trump Warning to Cuba | క్యూబాకు ట్రంప్ బెదిరింపు.. సమయం మించిపోక ముందే డీల్ కుదుర్చుకోవాలని వార్నింగ్!
వెనిజులా అధ్యక్షుడి అరెస్టు తర్వాత ట్రంప్ దుస్సాహసాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే మెక్సికోను హెచ్చరించిన ట్రంప్.. తాజాగా ఆదివారం నాడు క్యూబాను బెదిరించారు. సమయం మించి పోకముందే తమతో ఒప్పందానికి రావాలని, లేని పక్షంలో క్యూబాకు చమురు అందబోదని బెదిరించారు.
Trump Warning to Cuba | ప్రపంచానికి తానే పెద్దన్న అని విర్రవీగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో దుస్సాసహసానికి తెగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని కొన్ని నెలలుగా బెదిరించి.. ఇటీవల అకస్మాత్తుగా ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాలరాస్తూ అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనేక దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా ట్రంప్ తన ధోరణి మార్చుకోవడం లేదు. కొత్త సామ్రాజ్యవాదాన్ని అమల్లోకి తెస్తూ.. తనకు వ్యతిరేకంగా ఉండే దేశాధినేతలను బెదిరిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా అదివారం (01.11.2026) క్యూబాకు ఇదే తరహా బెదిరింపులు చేశారు. ‘ఆలస్యం కాకముందే’ అమెరికాతో ఒప్పందానికి రావాలని వార్నింగ్ ఇచ్చారు. తమతో ఒప్పందం చేసుకోని పక్షంలో క్యూబా ఎలాంటి చమురు లేదా నిధులు పొందే అవకాశం ఉంబోదని చెప్పారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘ఇకపై క్యూబాకు చమురుగానీ, నిధులు కానీ అందవు. జీరో. మాతో ఒప్పందం చేసుకోవాలని బలంగా సలహా ఇస్తున్నా.. అది కూడా సమయం మించి పోకముందే’ అని ఆ పోస్టులో వార్నింగ్ ఇచ్చారు.
వెనిజులా నుంచి అనేక సంవత్సరాలుగా పెద్ద మొత్తంలో చమురు, నిధులను క్యూబా పొందుతూ బతికిందని ట్రంప్ అన్నారు. ‘దానికి ప్రతిగా వెనిజులా చివరి ఇద్దరు నియంతలకు భద్రతా సర్వీసులు అందించింది’ అని రాసుకొచ్చారు. అయితే.. ఇకపై అలాంటివి ఏవీ ఉండబోవని హెచ్చరించారు.
వెనిజులాపై ఇటీవలి అమెరికా మిలిటరీ చర్యపై అప్‌డేట్స్ ఇచ్చిన ట్రంప్.. ‘అమెరికా దాడిలో క్యూబాకు చెందిన అనేక మంది చనిపోయారు. వెనిజులాను చాలా కాలంగా బందీలుగా పెట్టుకున్న దొంగలు, దోపిడీదారుల నుంచి ఇకపై ఎలాంటి రక్షణలు అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
అమెరికా ఖండంలో రాజకీయ సమీకరణాలను మార్చివేసేలా ట్రంప్ వార్నింగ్స్, ఎటాక్స్ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దాడికి కొద్ది వారాలు ముందుగానే వెనిజులాపై అమెరికా తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. వెనిజులాకు చెందిన అనేక చమురు నౌకలపై ‘మాదక ద్రవ్యాల’ ముద్ర వేస్తూ సీజ్ చేసింది. అనంతరం వెనిజులాలోకి అక్రమంగా ప్రవేశించి.. నికొలస్ మదురోను అదుపులోకి తీసుకుని, అమెరికాకు పట్టుకు పోయింది. మెక్సికోను సైతం బెదిరిస్తున్నది.
వెనిజులా ఇప్పుడు అమెరికా మిలిటరీ అండదండలతో ఉన్నదని ట్రంప్ తన తాజా పోస్టులో పేర్కొన్నారు. ఇకపై వెనిజులాను అమెరికా మిలిటరీయే కాపాడుతుందన్నారు. ఇక వెనిజులా నుంచి క్యూబాకు చమురు అందే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
క్యూబాకు ఇప్పటి దాకా వెనిజులా అతిపెద్ద చమురు సరఫరా దేశంగా నిలిచింది. అమెరికా మిలిటరీ వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం దేశాధ్యక్ష బాధ్యతలను వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్వెజ్ చేపట్టారు. అయితే.. చమురును అమెరికాకు మాత్రమే పంపేలా డెల్సీపైనా ట్రంప్ విజయవంతంగా ఒత్తిడి చేశారు. క్యూబాకు వెనిజులా చమురు అందకపోవడం ఆ ద్వీప దేశాన్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేసే అంశమే. క్యూబా చమురులోటులో సుమారు 50 శాతాన్ని కవర్ చేసేలా రోజుకు 27వేల చమురు బ్యారెళ్లను క్యూబాకు వెనిజులా పంపినట్టు ఆ దేశ అధికారిక చమురు సంస్థ పీడీవీఎస్‌ఏ గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
Read Also |
Afsana Pawar Next Mona Lisa | నెట్టింట మరో ‘మోనాలిసా’.. వీడియో వైరల్
Ana Julia | అతిపెద్ద అనాకొండా.. అమెజాన్ అడవుల్లో కనిపించిన అనా జూలియా!! పొడవు తెలిస్తే షాకే!
Mana Shankara Vara Prasad Gaaru: చిరంజీవి.. ‘మన శంకర వరప్రసాద్’కు ఊరట! రివ్యూలు, రేటింగ్‌లకు నో
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram