Ana Julia | అతిపెద్ద అనాకొండా.. అమెజాన్ అడవుల్లో కనిపించిన అనా జూలియా!! పొడవు తెలిస్తే షాకే!
ఈక్వెడార్‌లోని అమెజాన్ అడవుల్లో నేషనల్ జియోగ్రాఫిక్ బృందం 2024లో తిరుగుతున్న సమయంలో 20.7 అడుగుల పొడవు, 441 పౌండ్ల బరువుతో ఉన్న అనాకొండను గుర్తించింది. దానికి అనా జూలియా (Ana Julia) అని నామకరణం చేశారు. ఇప్పటి వరకూ శాస్త్రీయంగా రికార్డయిన అతిపెద్ద అనాకొండా ఇదే. అంతేకాదండోయ్.. ఇది కొత్త ఉప జాతి నార్తర్న్ గ్రీన్ అనాకొండా అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Ana Julia | కొండచిలువలు భారీగా ఉంటాయి.. అనాకొండాలు మరింత భారీగా ఉంటాయి.. మరి ఈ కొండచిలువలు, అనాకొండాల జాతుల్లో అతిపెద్ద పాము జాతి పేరేంటి? దీనిని నేషనల్ జియోగ్రాఫిక్ పరిశోధకులు అమెజాన్ అడవుల్లో 2024లో గుర్తించారు. భూమిపై ఇప్పటి దాకా గుర్తించిన పెద్ద పాము ఇదేనని శాస్త్రీయంగా ధృవీకరించారు.
అనా జూలియా! అనాకొండా జాతుల్లో అతి భారీ పాముగా గుర్తించిన గ్రీన్ అనాకొండా ‘అనా జూలియా’ పొడవు 20.7 అడుగులు. ఇది 441 పౌండ్లు.. అంటే సుమారు 200 కిలోల బరువు ఉంటుంది. ఇప్పటిదాకా భారీ పాము విషయంలో ఉన్న అంచనాలను అనా జూలియా పటాపంచలు చేసింది.
ఈ భూమిపై ఉన్న అత్యంత శక్తిమంతమైన, భయానకమైన సరీసృపాల జాతుల్లో అనాకొండా ఒకటి. ప్రపంచంలో ఇప్పటి వరకూ అటు పరిమాణంలో, ఇటు పొడవులో గ్రీన్ అనాకొండా (Eunectes murinus) అతిపెద్ద పాముగా గుర్తింపు పొందింది. ఇందులో ఆడ అనాకొండాలు మగవాటి కంటే అనేక రెట్లు పెద్దగా పెరుగుతాయి.
అనాకొండాలు ప్రధానంగా దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులు, నదీప్రాంతాలు, చెరువుల్లో ఎక్కువగా దర్శనిస్తుంటాయి. దేశాలవారీగా చూస్తే.. బ్రెజిల్, కొలంబియా, వెనిజులా, పెరు, ఈక్వెడార్ వంటి దేశాల్లో ప్రధానంగా కనిపిస్తాయి. వీటి టాలెంట్ ఏ స్టేజ్‌లో ఉంటుందంటే. ఒక్కోసారి శ్వాస తీసుకోకుండా ఏకంగా పది నిమిషాలపాటు నీళ్లలో ఉండగలవు. నీళ్లలో మునిగి.. మాటు వేసి.. దాహం తీర్చుకోవడానికి వివిధ జల వనరుల వద్దకు జింకల వంటి జీవులు వచ్చినప్పుడు హఠాత్తుగా వాటిపై దాడి చేసి.. స్వాహా చేస్తాయి.
అనాకొండ వేట ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని పాముల్లాగా వీటికి విషం ఉండదు. కానీ.. వీటికి జబ్బబలమే ఆయుధం. నీళ్లలో వేటాడే సమయంలో కళ్లు, ముక్కు మాత్రమే నీటికి కాస్త బయట ఉంటాయి. తన ఆహారం సమీపంలో ఉందంటే.. ఒక్కసారిగా దాన్ని చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసి హతమారుస్తాయి. ఆ పిదప ఎంచక్కా నోరు తెరిచి.. అమాంతం మింగేస్తాయి. దీని తల మనిషి తలంత ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు.
ఇవి సాధారణంగా 15 అడుగుల నుంచి 20 అడుగుల పొడవు వరకూ పెరుగుతాయి. బరువు సుమారు 200 నుంచి 300 పౌండ్ల వరకూ ఉంటాయి. కొన్ని అనా జూలియాలు 26 అడుగుల వరకూ పెరిగేవి కూడా ఉంటాయి. అప్పుడు వాటి బరువు 400 పౌండ్లపైనే ఉంటుంది. ఇక్కడో విశేషం ఏమిటంటే.. మగ అనాకొండాల కంటే.. ఆడ అనాకొండాలు దాదాపు ఐదు రెట్లు పెద్దవిగా ఉంటాయట. ఆడ పాములు ఒక్క దఫాలో 20 నుంచి 40 పిల్ల అనాకొండాలకు జన్మనిస్తాయి. పుట్టే పిల్ల అనాకొండ సైతం దాదాపు 2 అడుగల మేర పొడవు ఉంటాయి.
ఏంటీ అనా జూలియా స్పెషాలిటీ!
ఈక్వెడార్‌లోని అమెజాన్ అడవుల్లో నేషనల్ జియోగ్రాఫిక్ బృందం 2024లో తిరుగుతున్న సమయంలో 20.7 అడుగుల పొడవు, 441 పౌండ్ల బరువుతో ఉన్న అనాకొండను గుర్తించింది. దానికి అనా జూలియా (Ana Julia) అని నామకరణం చేశారు. ఇప్పటి వరకూ శాస్త్రీయంగా రికార్డయిన అతిపెద్ద అనాకొండా ఇదే. అంతేకాదండోయ్.. ఇది కొత్త ఉప జాతి నార్తర్న్ గ్రీన్ అనాకొండా అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇదే అన్నింటికంటే పెద్దదా?
నిజానికి స్థానిక ఆదివాసీల్లో అనాకొండాల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. 30 అడుగుల కంటే పొడవైన అనాకొండాలు కూడా అమెజాన్ లోతట్టు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని స్థానిక ఆదివాసీలు చెబుతున్నారు. ఇంకా మనిషి కండ పడని పెద్ద రాక్షస అనాకొండాలు అమెజాన్ అడవుల్లో ఉండే అవకాశాలను శాస్త్రవేత్తలు సైతం కొట్టిపారేయడం లేదు.
అనాకొండాలకూ సవాళ్లు
నిజానికి భారీ సరీసృపాలైన అనాకొండలకు సైతం రక్షణ విషయంలో తీవ్ర సవాళ్లు, ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా యథేచ్ఛగా అడవులను నరికివేయడంతో అనాకొండాలకు సహజ ఆవాస ప్రాంతాలు కుదించుకుపోతున్నాయి. దీనికి తోడు అక్రమ వేట.. అక్రమంగా పెంపుడు జంతువుల వ్యాపారం పెను సవాళ్లుగా తయారయ్యాయి. 2025 మార్చ్ నెలలో దక్షిణ బ్రెజిల్‌లోని గ్రామీణ ప్రాంతం బోనిటో సమీపంలో ఫార్మోసో నది సమీపంలో చనిపోయి పడి ఉన్న అనా జూలియా ఒకదాన్ని గుర్తించారు. తుపాకి తుటా తగిలి చనిపోయినట్టు నిర్ధారించారు. అనాకొండాలు భీకరంగా కనిపించినా.. ప్రకృతిలో సమతుల్యాన్ని కాపాడే అద్భుత జీవులు. మొత్తంగా అనా జూలియా చెబుతున్న మాట.. ఈ భూమిపై మనకు ఇంకా తెలియని అద్భుతాలు ఇంకా ఎన్నో ఉన్నాయని!! వాటిని కాపాడుకోవాలని!!
Read Also |
Calendar | క్యాలెండర్‌తో భార్యాభర్తల బంధం బలోపేతం..? ఇది ఎంత వరకు నిజం..!
Beggar | యాచకుడి ప్రజాసేవ.. భిక్షం ఎత్తుకోగా వచ్చిన డబ్బుతో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ
SuperShe Island | ఈ ఐలాండ్ అమ్మాయిలకు మాత్రమే.. ఎందుకంటే?.. అబ్బాయిలు వెళ్తే ఇక అంతే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram