Donald Trump : వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ ట్రంప్‌ సంచలన ప్రకటన

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్ చేశారు. మదురో అరెస్ట్ తర్వాత వెనెజువెలాపై పట్టు కోసం అమెరికా వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Donald Trump : వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ ట్రంప్‌ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని (Acting President Of Venezuela) తానే అని ప్రకటించుకున్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టారు.

ఈ ఏడాది ఆరంభంలో వెనెజువెలా (Venezuela)పై అమెరికా (America) సైనిక దాడి చేపట్టిన విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల నిర్వహణ, అక్రమంగా అధికారంలో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో (Nicolas Maduro)ను అధికారం నుంచి దింపేందుకు అనేక నెలలుగా ఒత్తిడి తీసుకువస్తున్న అమెరికా చివరకు ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆయనతోపాటూ మదురో భార్యను కూడా నిర్బంధించి తీసుకెళ్లింది. ఈ పరిణామాలతో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న డెల్సీ రెడ్రిగ్జో యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ సమయంలో ట్రంప్‌ పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది.

అయితే, వెనెజువెలాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన పెట్టిన తాజా పోస్ట్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. వికీపీడియా పేజిని పోలినట్లుగా ఉన్న ఎడిటెడ్ ఫొటోను ట్రంప్ పోస్టు చేశారు. అందులో డోనాల్డ్ ట్రంప్ ఫొటో కింద వెనెజువెలా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని రాసి ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లుగా ఉంది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి :


Ajit Doval : మొబైల్‌, ఇంటర్నెట్‌ వాడని అజిత్‌ దోవల్‌.. ఎందుకో తెలుసా..?
Pawan Kalyan | మార్ష‌ల్ ఆర్ట్స్‌తో స‌రికొత్త రికార్డ్ సృష్టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. దాని వెన‌క క‌థ ఏంటంటే..!