గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాభాయ్ చానూ చరిత్ర సృష్టించారు. 48 కేజీల విభాగంలో భారత్‌కు పసిడి పతకం అందించిన మీరాభాయ్ అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు. మీరాకు ఇది వరుసగా మూడో కామన్వెల్త్ పసిడి కాగా మెత్తంగా నాలుగో పతకం. స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 105 కేజీల బరువు ఎత్తిన చానూ..మొత్తం 190 కేజీలు ఎత్తింది. మిగతా లిఫ్టర్లు ఆమెకు చాలా దూరంలోనే ఆగిపోయారు. కామన్వెల్త్‌లో అత్యధిక బరువు ఎత్తిన మహిళా లిఫ్టర్‌గా సరికొత్త రికార్డు సాధించారు.
అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించిన మీరాభాయ్ చానూపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ విజయం అనంతరం స్వర్ణ పతకం అందుకుంటూ మీరాబాయి ఆనంద భాష్ఫాలాలతో భావోద్వేగానికి గురైంది. కామన్వెల్త్ క్రీడల్లో హ్యాట్రిక్ స్వర్ణం సాధించిన ఛానూ తన తర్వాతి లక్ష్యం సెప్టెంబరులో మొదలయ్యే ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడమేనని తెలిపింది.
