India Vs Australia | నేటి భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వానగండం..! రద్దయితే సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయంటే..?

India Vs Australia | టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌ సోమవారం కీలక మ్యాచ్‌ ఆడబోతున్నది. సెయింట్‌ లూసియాలోని డారెన్‌ సామీ నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్నది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకం. ఈ సూపర్‌ 8 మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమిస్‌లోకి అడుగుపెడుతుంది.

India Vs Australia | నేటి భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వానగండం..! రద్దయితే సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయంటే..?

India Vs Australia | టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌ సోమవారం కీలక మ్యాచ్‌ ఆడబోతున్నది. సెయింట్‌ లూసియాలోని డారెన్‌ సామీ నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్నది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకం. ఈ సూపర్‌ 8 మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమిస్‌లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఆడిన రెండుమ్యాచుల్లో విజయాలతో టీమిండియా జోరుమీదున్నది. ఆస్ట్రేలియా జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఓటమితో షాక్‌లో ఉన్నది. దీంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకోవాలని భావిస్తున్నది. ఈ క్రమంలో మ్యాచ్‌ టీమిండియా, ఆసిస్‌ జట్లకు కీలకంగా మారింది. అయితే, ఈ మ్యాచ్‌కు వానగండం ఉన్నది. అక్యూవెదర్‌ రిపోర్ట్‌ ప్రకారం.. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్‌ సమయంలో 40శాతం వానకురిసే అవకాశాలున్నాయని వెదర్‌ రిపోర్ట్‌ తెలిపింది.

మ్యాచ్‌ రద్దయితే ఏం జరుగుతుంది..?

ఇక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌ వర్షం కారణంగా నిలిచిపోతే గణాంకాలు ఆసక్తికరంగా మారనున్నాయి. భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌లోకి వెళ్తుంది. మ్యాచ్‌ రద్దయితే చెరో పాయింట్‌ లభిస్తుంది. అప్పుడు కూడా భారత్‌ జట్టు ఐదుపాయింట్లతో సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. అయితే, ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఆఫ్ఘనిస్థాన్‌పై రెండో సెమీస్‌ బెర్తు ఆధారపడి ఉంటుంది. బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘన్‌ చివరి మ్యాచ్‌ ఆడనున్నది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నాలుగు పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఆసిస్‌ ఓటమిపాలైతే అవకాశాలు జఠిలంగా మారుతాయి. భారత్‌పై గెలిస్తే నాలుగు పాయింట్లతో సెమీస్‌ రేసులో ఉంటుంది. బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్థాన్ కూడా గెలిస్తే.. మూడుజట్లు నాలుగేసి పాయింట్లతో సెమీస్‌కు పోటీపడతాయి. ఇందులో నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా బెర్తులను నిర్ణయిస్తారు. భారత్ చేతిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోయినా సమీకరణాల్లో నెట్‌రన్‌రేట్‌ కీలకం కాబోతున్నది. మరి నేటి మ్యాచ్‌ ఎవరు గెలువనున్నారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.