Ind vs Pak | ఆసియాకప్​ – బ్యాట్లు, బంతులే ఆయుధాలు : నేడే భారత్​–పాకిస్తాన్ సమరం

ఆసియా కప్ 2025లో నేడు ఇండియా–పాకిస్తాన్ ప్రతిష్టాత్మక మ్యాచ్. కీ ప్లేయర్స్, పిచ్ రిపోర్ట్, హెడ్-టు-హెడ్ రికార్డ్స్‌తో ఉత్కంఠభరితమైన సమాచారం ఇదిగో.

Ind vs Pak | ఆసియాకప్​ – బ్యాట్లు, బంతులే ఆయుధాలు : నేడే భారత్​–పాకిస్తాన్ సమరం

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విధాత):
Ind vs Pak | క్రికెట్‌లో ఎప్పటికీ ఉత్కంఠ రేపే మ్యాచ్​ అంటే భారత్–పాక్ పోరే.  తుపాకులు, బుల్లెట్ల బదులు బ్యాట్లు, బంతులు ఉండే యుద్ధం. నేటి సాయంత్రం ఆసియా కప్ 2025లో భాగంగా ఇరు జట్లు తలపడుతుండగా, అభిమానుల్లో ఉత్సాహం అత్యున్నతస్థాయికి చేరింది. టోర్నమెంట్‌లో పాయింట్లకే కాకుండా ప్రతిష్టకూ సంబంధించిన ఈ మ్యాచ్‌కి సహజంగానే క్రేజ్​ ఏర్పడింది.

India vs Pakistan Asia Cup 2025 preview, India and Pakistan cricket players, high-voltage clash, IND vs PAK head-to-head stats

భారత్ బలం

భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఓపెనింగ్‌లో అభిషేక్​ శర్మ, శుభ్‌మన్ గిల్ తమ ఫామ్‌తో దూకుడుగా రాణిస్తున్నారు. మధ్యలో సూర్యకుమార్‌ తనదైన షాట్లతో జట్టుకు భారీ స్కోరు అందించే ఊపునిస్తాడు. హార్ధిక్ పాండ్యా అటు బ్యాట్​తో, ఇటు బాల్​తో మాయాజాలం చేయగలడు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తన వేగం, డెత్ ఓవర్ల నైపుణ్యంతో, కుల్దీప్ యాదవ్ తన స్పిన్‌తో కీలకం కానున్నారు.

భారత కీ ప్లేయర్స్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్​ శర్మ,  శుభ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.

India, Pakistan player will try to win the match at any cost

పాకిస్తాన్ ఆశలు

పాకిస్తాన్ తరఫున సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. టాప్ ఆర్డర్లో ఫఖర్ జమాన్, సయీమ్ అయ్యూబ్, మిడ్ ఆర్డర్లో కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీలకం. బౌలింగ్‌లో షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్ ప్రధాన బలం. వికెట్‌కీపర్‌గా మహ్మద్ హారిస్ కూడా కీలక పాత్ర పోషించగలడు. కానీ జట్టు కావల్సినంత బలంగా లేదన్నది మాత్రం నిజం.

పాకిస్తాన్ కీ ప్లేయర్స్: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), ఫఖర్ జమాన్, సయీమ్ అయ్యూబ్, మహ్మద్ హారిస్ (wk), షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్.

రుదేశాల రికార్డులు

భారత్–పాక్ క్రికెట్ పోటీలు ఎప్పుడూ క్రికెట్ అభిమానుల్లో కరెంటు పుట్టిస్తాయి. దేశాధినేతలు సైతం మ్యాచ్​ తీరు పట్ల ఆసక్తి చూపిస్తారు.  ఆసియా కప్ చరిత్రలో భారత్ ఎక్కువ విజయాలు సాధించినా, పాకిస్తాన్ కూడా పలు కీలక పోరుల్లో సత్తా చాటింది.

హెడ్-టు-హెడ్ రికార్డ్స్ (ఆసియా కప్ వరకు)

ఫార్మాట్ మ్యాచ్‌లు భారత్ విజయాలు పాక్ విజయాలు ఫలితం రాని మ్యాచ్‌లు
ODIs 14 8 5 1
T20Is 4 3 1 0
మొత్తం 18 11 6 1

(డేటా: ఆసియా కప్ రికార్డ్స్ ఆధారంగా)

పిచ్ & వాతావరణం

వేదికలో పిచ్ పేసర్లకు, స్పిన్నర్లకు రెండింటికీ సహకరించేలా ఉంది. బ్యాట్స్‌మెన్లు ఆరంభంలో జాగ్రత్తగా ఆడాలి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

భారత్–పాక్ పోరు అంటే ఎప్పుడూ క్రికెట్ సమరమే. సోషల్ మీడియా ట్రెండ్స్, టికెట్ డిమాండ్ చూస్తే నేటి పోరుకు ఎంత ఉత్సుకత  ఉందో అర్థమవుతోంది. ప్రతి బంతి, ప్రతి పరుగూ ఉత్కంఠ రేపే అవకాశం ఉంది.