మూడో టీ20లో భారత్ ఓటమి

విధాత,చెమ్స్‌ఫోర్డ్‌‌: ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుతో ఆఖరి, నిర్ణాయక మూడో టీ20లో టీమిండియా జట్టు ఓటమిపాలైంది. దీంతో ఈ సిరీస్‎ను కూడా భారత్ జట్టు కోల్పోయింది. నెల రోజులుగా సాగిన ఈ టూర్‎లో టీమిండియా ఆడిన ఒక టెస్టును మాత్రమే డ్రా చేసుకోగలిగింది. తర్వాత ఆడిన వన్డే, టీ20 సిరీస్ లను వరుసగా 2-1తో ఓటమిని మూటగట్టుకుంది. బుధవారం టీమిండియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్‎లో ఓపెనర్‌ స్మృతి మంధాన (70; 51 […]

మూడో టీ20లో భారత్ ఓటమి

విధాత,చెమ్స్‌ఫోర్డ్‌‌: ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుతో ఆఖరి, నిర్ణాయక మూడో టీ20లో టీమిండియా జట్టు ఓటమిపాలైంది. దీంతో ఈ సిరీస్‎ను కూడా భారత్ జట్టు కోల్పోయింది. నెల రోజులుగా సాగిన ఈ టూర్‎లో టీమిండియా ఆడిన ఒక టెస్టును మాత్రమే డ్రా చేసుకోగలిగింది. తర్వాత ఆడిన వన్డే, టీ20 సిరీస్ లను వరుసగా 2-1తో ఓటమిని మూటగట్టుకుంది. బుధవారం టీమిండియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

భారత్ బ్యాటింగ్‎లో ఓపెనర్‌ స్మృతి మంధాన (70; 51 బంతుల్లో 8×4, 2×6), అర్ధ శతకంతో మెరుపు బ్యాటింగ్‌ చేయగా, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (36; 26 బంతుల్లో 5×4, 1×6) ధాటిగా ఆడింది. టీనేజర్‌ షఫాలీ వర్మ (0), హర్లీన్‌ డియోల్‌ (6) నిరాశ పర్చారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఎక్లెస్టోన్‌ (3/35), బ్రంట్‌ (2/27) రాణించారు. అనంతరం 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు..రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో టార్గెట్ పూర్తి చేసింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‎లో ఓపెనర్‌ డేనీల్లె వ్యాట్‌ (89; 56 బంతుల్లో 12×4, 1×6) మరింత ధాటిగా ఆడారు. వన్‌డౌన్‌ వచ్చిన నాటాలీ సివర్‌ (42; 36 బంతుల్లో 4×4)భారత్ బౌలర్లపై విరుచుకుపడింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు అతి సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది.