Uncapped Rule | ధోనీ కోసమే బీసీసీఐ అన్‌క్యాప్డ్ రూల్‌ని తెచ్చిందా..? ఐపీఎల్ చైర్మన్ ధుమాల్ ఏమన్నారంటే..?
Uncapped Rule | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో బీసీసీఐ అన్‌క్యాప్డ్ నిబంధనను మళ్లీ తీసుకువచ్చింది. అయితీ, ధోనీ మరో సీజన్‌లోను ఆడేందుకే బీసీసీఐ రూల్‌ను మరోసారి తీసుకువచ్చిందని ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ వార్తలను ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఖండించారు.

Uncapped Rule | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో బీసీసీఐ అన్‌క్యాప్డ్ నిబంధనను మళ్లీ తీసుకువచ్చింది. అయితీ, ధోనీ మరో సీజన్‌లోను ఆడేందుకే బీసీసీఐ రూల్‌ను మరోసారి తీసుకువచ్చిందని ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ వార్తలను ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఖండించారు. ఈ రూల్ కేవలం ధోనీ కోసం మాత్రమే కాదని.. పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా వంటి ఆటగాళ్లకు సైతం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి2025-27 సంవత్సరాలకు సంబంధించి ఆటగాళ్లను నిబంధనలను వెల్లడించింది. ఇందులో భాగంగానే అన్‌క్యాప్డ్ రూల్‌ను మళ్లీ తీసుకువచ్చింది. ఈ రూల్ ప్రకారం.. ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాడిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తుంటారు. తొలుత ఈ రూల్‌ని 2008లో బీసీసీఐ ప్రవేశపెట్టింది. 2021లో దాన్ని రద్దు చేసింది. అయితే, ఈ రూల్‌ను మళ్లీ తీసుకురావడంపై మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, బీసీసీఐ ధోనీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే తీసుకువచ్చిందని క్రికెట్ విశ్లేషకులు విమర్శించారు.
అయితే, ఓ ఇంటర్వ్యూలో అరుణ్ ధుమాల్ రూల్‌పై వివరణ ఇచ్చారు. మ్యాన్ ప్లానింగ్, వ్యూహాల విషయంలో ధోనీకి ఎవరూ సరిపోలరని చెప్పారు. అయితే, అతను అన్‌క్యాప్డ్ ఆటగాడా..? క్యాప్డ్ ఆటగాడా..? అని ఏ ఫ్రాంచైజీ చూడదని.. అతన్ని తీసుకోవాలను అనుకుంటారన్నారు. ధర విషయంలోనూ వెనుకాడబోరని.. అన్‌క్యాప్డ్ రూల్ అతన్ని దృష్టిలో పెట్టుకొని తెచ్చామనడం సరికాదన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు సైతం క్రికెట్ ఆడేందుకు ఫిట్‌గానే ఉన్నారన్నారు. పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా రిటైర్‌మెంట్ ప్రకటించి చాలాకాలం అయినా.. ఐపీఎల్‌లో తమ జట్ల తరఫున రాణిస్తున్నారంటూ గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు మెగా వేలం జరుగనున్నది. వేలానికి ముందు ఆటగాళ్లు ఫ్రాంచైజీలు విడుదల చేయనున్నాయి. క్యాప్డ్ ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకునేందుకు రూ.11కోట్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు రూ.4కోట్లు ఫ్రాంచైజీలు చెల్లించాల్సి రానున్నది. ఐపీఎల్ వేగంగా ఈ నవంబర్‌లో జరుగనున్నట్లు తెలుస్తున్నది. రెండోవారం లేదా మూడోవారంలో వేలం జరుగనున్నట్లు సమాచారం.