IPL RCB | ఐపీఎల్ -2025 ట్రోఫీ గెలుచుకున్నబెంగుళూరు రాయల్ చాలెంజర్స్ టీమ్ విజయోత్సవం వేడుక విషాదంగా మారింది. బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 11 మృతి చెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు.
అభిమానులు ఒక్కసారిగా స్టేడియం లోపలికి ఒక్కసారిగా దూసుకు రావడంతో వారిని నియత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు అభిమానులు మృతి చెందగా మరో 37మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా అంతకుముందే విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీని నిర్వహించాలన్న కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థనకు ప్రభుత్వం భారీగా తరలివచ్చే అభిమానుల సంఖ్యను అదుపు చేయలేమన్న కారణంతో అనుమతించలేదు. అలాంటప్పుడు స్టేడియం వద్ద జరిగే సన్మాన వేడుకకు కూడా అభిమానులు భారీగా వస్తారన్న అంచనాలున్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయని పోలీసులు, ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
#chinnaswamystadium #RCBvPBKS #ViratKohli pic.twitter.com/kBjc5IOdoa
— Tharun Reddy (@Tarunkethireddy) June 4, 2025