T20 World Cup| 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఘనత పట్ల యావత్ దేశం మైమరచిపోతుంది. స్వదేశంలో కప్‌తో అడుగుపెట్టిన భారత్‌కి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో ల్యాండ్ అయినప్పటి నుండి టీమిండియాకి అడుగడుగున ఘన స్వా
T20 World Cup| 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఘనత పట్ల యావత్ దేశం మైమరచిపోతుంది. స్వదేశంలో కప్‌తో అడుగుపెట్టిన భారత్‌కి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో ల్యాండ్ అయినప్పటి నుండి టీమిండియాకి అడుగడుగున ఘన స్వాగతం లభిస్తుంది. ప్రధాని మోదీ కూడా టీమిండియాకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పి వారిని అభినందించారు. ఇక వాంఖడే స్టేడియానికి సమీపంలో ఓపెన్ బస్‌లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ఫ్యాన్స్ కోలాహలంతో ముంబై వీధులు, రోడ్లు అన్ని కిక్కిరిసిపోయాయి.
భారత జట్టు బస్సు వెళ్లే మార్గంలో చీమ దూరడానికి వీలులేనంతగా నిండిపోయింది. ఫ్యాన్స్ నుంచి ఊహించని రీతిలో ఇలాంటి ఘన స్వాగతం లభించడంతో ఇండియన్స్ ప్లేయర్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. కొందరైతే కన్నీరు కూడా పెట్టుకున్నారు. విరాట్ కోహ్లీ అయితే పరేడ్ జరుగుతున్నంత సేపు వారిలో ఆనందం నింపే ప్రయత్నం చేశారు. ఇక రోహిత్ శర్మతో కలిసి కప్ పెకెత్తి సాధించామంటూ గట్టిగా అరిచాడు కింగ్. టీమిండియా విజయోత్సవంకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే కప్ గెలిచినప్పటి నుండి కూడా టీమిండియా ఆటగాళ్లు ఆ కప్పుతో తెగ ఫోటోలు దిగడం, దానికి ముద్దులివ్వడం, గాల్లోకి ఎత్తి మేము సాధించామంటూ హడావిడి చేయడం మనం చూస్తున్నాం.
అయితే రోహిత్ సేన దగ్గర ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఐసీసీ నిర్వహించే టోర్నీలో ఒరిజినల్ ట్రోఫీని కేవలం ఫొటో షూట్ కోసం మాత్రమే ఇస్తారట. ఇక విన్నర్ టీమ్ తమ దేశానికి ట్రోఫీని తీసుకెళ్లడానికి అచ్చం అలాంటిదే ఇయర్, ఈవెంట్ లోగోతో డూప్లికేట్ ట్రోఫీని రూపొందించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇస్తుందట. ఇక ఒరిజినల్ ట్రోఫీ మాత్రం దుబాయ్‌లోని ఐసీసీ హెడ్ ఆఫీస్‌లోనే ఉంటుంది. అయితే భారత ఆటగాళ్లు ఇప్పుడు కప్‌తో తెగ హంగామా చేస్తుండగా, అది డూప్లికేట్ కప్ అట. ఈ విషయం తెలుసుకొని అందరు ఆశ్చర్యపోతున్నారు.