Ranji Trophy | తొలిసారిగా రంజీ ట్రోపీ విజేతగా జమ్మూ కశ్మీర్ చారిత్రాక విజయం
రంజీ ట్రోఫీ 2025-26లో జమ్మూ కశ్మీర్ చరిత్ర సృష్టించింది. కర్ణాటకపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తొలిసారి టైటిల్ గెలుచుకుంది.
విధాత: తొలిసారిగా జమ్మూ కశ్మీర్ క్రికెట్ జట్టు రంజీట్రోఫీ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఐదో రోజు శనివారం డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూ కశ్మీర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జమ్మూ కశ్మీర్ బ్యాటర్ శుభమ్ పుందిర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబీ ఎంపికయ్యారు. 1959-1960లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన జమ్మూ కశ్మీర్ తన 67ఏళ్ల దేశవాళీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ చేరడంతో పాటు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాక ఘట్టాన్ని చూసేందుకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కర్ణాటక హుబ్లీ స్టేడియంకు రావడం విశేషం.
ఓవర్‌నైట్ 186/4 స్కోరుతో జమ్మూ కశ్మీర్ తన రెండో ఇన్నింగ్స్‌ను చివరి రోజూ కొనసాగించింది. ఖమ్రాన్ ఇక్బాల్ (160*), సాహిల్ లోత్రా (101*) సెంచరీలు సాధించారు. 342/4 స్కోరు వద్ద జమ్మూ కశ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికి మరొక్క సెషన్ ఆట మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఫలితం వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగిసేందుకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 291పరుగుల భారీ ఆధిక్యతతో జమ్మూకశ్మీర్ టైటిల్‌ను దక్కించుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ కశ్మీర్ 584 పరుగులు చేయగా.. బ్యాటర్ శుభమ్ పుందిర్(121) సెంచరీతో పాటు ఐదుగురు ఆటగాళ్లు అర్థసెంచరీలతో భారీ స్కోరుకు పునాది వేశారు. కర్ణాటక బౌలర్లలో పేసర్ ప్రసిద్ కృష్ణ 5వికెట్లు, శ్రేయస్ గోపాల్, విద్యాధర పాటిల్, శ్రీకర్ శెట్టి , విజయ్ కుమార్ వైశాక్ లు తలో వికెట్ సాధించారు. కర్ణాటక తన తొలి ఇన్నింగ్స్ లో 293 పరుగులకే ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ సెంచరీ(160) పరుగులు చేయగా, కరణ్ నాయర్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ సహా అంతా విఫలమయ్యారు. జమ్మూ కశ్మీర్ బౌలర్ అకిబ్ నబీ 5వికెట్లు సాధించి టోర్నీలో 60వికెట్లను సొంతం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
టీనేజర్లలో ఇన్స్టాగ్రామ్ ‘వ్యసనం’? మెటా రహస్య నివేదికల్లో సంచలన విషయాలు: కోర్టులో విచారణ
Israel, USA Strikes Iran : ఇరాన్ పై విరుచుకపడిన ఇజ్రాయెల్, అమెరికా
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram