Jay Shah | ఐసీసీ చైర్మన్‌గా జై షా నియామకయ్యేనా..? కొలంబోలో జరిగే ఎంజీఎంలో క్లారిటీ వచ్చే ఛాన్స్..!
Jay Shah | బీసీసీఐ సెక్రటరీ జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్ బాధ్యతలు తీసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 19 నుంచి శ్రీలంకలోని కొలంబో వేదికగా ఐసీసీ వార్షిక సమావేశం (AGM) సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.

Jay Shah | బీసీసీఐ సెక్రటరీ జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్ బాధ్యతలు తీసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 19 నుంచి శ్రీలంకలోని కొలంబో వేదికగా ఐసీసీ వార్షిక సమావేశం (AGM) సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇందులో తర్వాత ఐసీసీ చైర్మన్ ఎవరు ? అన్న అంశంపై సైతం చర్చకు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్‌లే ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2025 వరకు ఆయన పదవిలో కొనసాగే అవకాశం ఉన్నది. లేకపోతే ఆయన స్థానంలో జై షా బాధ్యతలు తీసుకునేందుకు అవకాశాలున్నాయి. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. 2025లో భారత బోర్డులో కూలింగ్ ఆఫ్ పీరియడ్ ప్రారంభం కావడానికి ముందు బీసీసీఐ సెక్రటరీగా ఇంకా ఒక సంవత్సరం మిగిలి ఉన్నది. డిసెంబర్ 2024 నుంచి డిసెంబర్ 2026 వరకు పదవీకాలాన్ని పూర్తి చేస్తాడని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
2025లో ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకొని.. మళ్లీ 2028 నాటికి మళ్లీ బీసీసీఐ బోర్డులోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు వెస్టిండిస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలో నిర్వహించిన మ్యాచ్‌ల కారణంగా ఐసీసీకి 20వేల అమెరికన్ డాలర్స్ నష్టం జరిగింది. ఈ విషయంలో సమావేశంలో చర్చ జరిగే అకాశాలున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది పాక్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగబోతున్నది. ఇందులో భారత జట్టు పాల్గొనే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. పాక్ వెళ్లేందుకు బీసీసీఐకి అనుమతి ఇస్తేనే టీమిండియా వెళ్తుంది. పాక్‌కు టీమిండియా వస్తేనే భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే 2026లో నిర్వహించే టీ20 వరల్డ్ కప్‌కు వస్తామని.. లేకపోతే లేదని స్పష్టం చేసింది. అయితే, భారత్ ఆడ మ్యాచులను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను పాక్ తోసి పుచ్చింది. ఈ అంశంపై సైతం ఎంజీఎంలో చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.