Kavya maran| అన్ని జ‌ట్ల ఓన‌ర్స్ క‌న్నా కావ్య మార‌న్ బెస్ట్ ఓన‌రా.. ఎందుకంటే..!

Kavya maran| ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా రంజుగా సాగుతుంది. కొన్ని రోజులుగా ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా అందిస్తున్న ధ‌నాధ‌న్ టోర్నీ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ ఆదివారం స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్, కోల్‌క‌తా మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఫైన‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ గెల‌వాల‌ని ఫ్యాన్స్ ఎంత‌గానో కోరుకుంటున్నారు. అయి

  • By: sn    sports    May 25, 2024 7:57 AM IST
Kavya maran| అన్ని జ‌ట్ల ఓన‌ర్స్ క‌న్నా కావ్య మార‌న్ బెస్ట్ ఓన‌రా.. ఎందుకంటే..!

Kavya maran| ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా రంజుగా సాగుతుంది. కొన్ని రోజులుగా ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా అందిస్తున్న ధ‌నాధ‌న్ టోర్నీ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ ఆదివారం స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్, కోల్‌క‌తా మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఫైన‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ గెల‌వాల‌ని ఫ్యాన్స్ ఎంత‌గానో కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఫైన‌ల్‌కి చేర‌డంతో ఆ జ‌ట్టు స‌హ యజమాని కావ్య మారన్ పేరు మారుమ్రోగిపోతుంది. త‌న టీంకి ఎంతో స‌పోర్ట్‌గా ఉంటూ ఆమె ఇచ్చిన ప్రోత్సాహం వ‌ల్ల‌నే ఆ జ‌ట్టు ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓడిన స‌మ‌యంలో ఆ జ‌ట్టు ఓన‌ర్ కేఎల్ రాహుల్‌పై చిర్రుబుర్రులాడ‌డం ఎంత పెద్ద హాట్ టాపిక్ అయిందో మ‌నం చూశాం.

కావ్య మార‌న్ మాత్రం ఏ సంద‌ర్భంలో అయిన ఆట‌గాళ్ల‌ని ప్రోత్స‌హిస్తుందే త‌ప్ప వారిని డీగ్రేడ్ చేయ‌డం వంటివి చేయ‌దు. ఎస్‌ఆర్‌హెచ్ గెలిస్తే కావ్య చేసే సంబరాలు చేసుకుంటుంది. ఓడితే బాధ‌ప‌డుతుంది. అంతేకాని ఎవ‌రిమీద పెత్త‌నం చెలాయించ‌దు.ఇక ఆట‌గాళ్ల వేలంలో కావ్య మార‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు ఒక్కోసారి విమ‌ర్శ‌ల బారిన ప‌డేలా చేస్తుంటాయి. ప్యాట్ కమిన్స్ కోసం కావ్య మారన్ రూ. కోట్లు కుమ్మరించినప్పుడు అంద‌రు షాక్ అయ్యారు. ఆమెని విమ‌ర్శించారు కూడా. కాని ఇప్పుడు ఆమె నిర్ణ‌యాన్ని మెచ్చుకుంటున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ.. కావ్య మార‌న్ ఐపీఎల్ బెస్ట్ ఓన‌ర్ అంటూ కొనియాడింది.

సొంత జట్టును ప్రోత్సహించడమే కాకుండా, ప్రత్యర్థి జట్టును మెచ్చుకోవడం కూడా కావ్య ప్రత్యేకత అని కోమల్ శర్మ అన్నారు. కావ్య‌.. క్రికెట్‌ను ఎంతో ఆస్వాదిస్తుంది. తన జట్టును ప్రోత్సహిస్తుంది. ప్రత్యర్థి టీమ్‌ను కొనియాడుతుంది. కావ్య మారన్ బెస్ట్ ఓనర్ అంటూ కోమ‌ల్ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చారు. గ‌త రాత్రి ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో దిగాలుగా కూర్చున్న కావ్య పాప వారి జ‌ట్టు గెలిచాక మాత్రం ఓ రేంజ్ సంబ‌రాలు చేసుకుంది. కావ్య జ‌ట్టు ఒక్క అడుగు దూరంలో మాత్ర‌మే ఉండ‌గా, ఈ సారైన వారు క‌ప్ కొడ‌తారా లేదా అనేది చూడాలి