Ind vs NZ|రెండో టెస్ట్‌లోను సత్తా చాటుతున్న న్యూజిలాండ్.. ఓటమి డిసైడ్ అయినట్టేనా?
Ind vs NZ|బెంగళూరులో దారుణమైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంది.పుణె వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నేడు రెండో టెస్ట్ ప్రారంభం కాగా, న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మాట్ హెన్రీ స్థానంలో కెప్టెన్ టామ్ లాథమ్ మిచెల్ సాం

Ind vs NZ|బెంగళూరులో దారుణమైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా(India) భావిస్తుంది.పుణె వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నేడు రెండో టెస్ట్ ప్రారంభం కాగా, న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మాట్ హెన్రీ స్థానంలో కెప్టెన్ టామ్ లాథమ్ మిచెల్ సాంట్నర్‌కు అవకాశం కల్పించాడు. అదే సమయంలో భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్‌లు పునరాగమనం చేయగా, వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం లభించింది. మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌లను ప్లేయింగ్-11 నుంచి తప్పించారు.
తొలి టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన కాన్వే ఈ మ్యాచ్‌లోను నిలకడగా ఆడుతున్నాడు. 47 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. కాన్వేతో పాటు క్రీజులో రచిన్ రవీంద్ర(5) ఉన్నారు.లంచ్ విరామానికి న్యూజిలాండ్ 31 ఓవర్లకు 92/2 స్కోరు చేసింది. అశ్విన్(Ashwin) రెండు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్స్ ఎవరు కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే భారత్‌కి డబ్ల్యూటీసీ అవకాశాలు కాస్త సన్నగిల్లుతాయి. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడడం పెద్ద దెబ్బ అని అంటున్నారు. ఈ పిచ్ నల్లటి మట్టితో చేశారు. బౌన్స్ తక్కువ ఉంటుంది. ఈ పిచ్‌లో నాలుగో ఇన్నింగ్స్ ఆడడం చాలా కష్టంగా మారుతుంది. దీంతో భారత్ టాస్ ఓడిపోవడంతో, నాలుగో ఇన్నింగ్స్ ఆడే పరిస్థితి వచ్చింది.
ఈ క్రమంలో తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి చేజేతులా ఓటమి కొని తెచ్చుకున్న భారత్.. రెండో టెస్ట్‌లో (Second Test)టాస్ ఓడిపోయి ఓటమిని తెచ్చుకునేలా కనిపిస్తుంది. సిరీస్‌లో పునరాగమనం చేయడానికి, WTC ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలి. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‍లో భారత్ ఏడు టెస్ట్‌లు ఆడనుండగా, ఈ ఏడు టెస్టుల్లో టీమిండియా కనీసం నాలుగు మ్యాచ్‍ల్లో గెలిచి.. రెండు డ్రా చేసుకోవాలి. ఇలా చేస్తే 67.54 శాతంతో డబ్ల్యూటీసీ ఫైనల్‍లో భారత్ అడుగుపెడుతుంది. ఐదు మ్యాచ్‍ల్లో గెలిస్తే మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే, ఈ ఏడు టెస్టుల్లో రెండు కంటే ఎక్కువ మ్యాచ్‍లలో భారత్ ఓడిపోతే ఫైనల్ చేరడం కష్టమవుతుంది. ఒకవేళ మూడు మాత్రమే గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఫైనల్ బెర్త్ ఆధారపడుతుంది.