NZ vs WI|ఉత్కంఠ పోరులో విండీస్‌పై నెగ్గి ఫైన‌ల్‌కి చేరిన కివీస్ .. చివ‌రి ఫైట్‌లో సాతాఫ్రికాతో ఢీ

NZ vs WI| యూఏఈ వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్ కప్ స‌మ‌రం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ టోర్నీ మొద‌టి నుండి చాలా ర‌స‌వత్త‌రంగా సాగుతూ వ‌చ్చింది. మొదటినుంచి దూకుడు ప్రదర్శించిన ఆస్ట్రేలియా ఫైనల్స్ అవకాశాలను చేజార్చుకోవ‌డం విశేషం. లీగ్ మ్యాచ్‌లో ఆధిప్యతాన్ని ప్రదర్శించిన ఆసీస్ సెమీస్‌కు చేరినప్పటికీ.. దక్షిణాఫ్రికా జట్టు కంగార్లకు ఝలక్ ఇవ్వ‌డంతో వారు ఇంటి బాట ప‌ట్టారు.ఇక మ‌రో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ గ‌త రాత్రి

  • By: sn    sports    Oct 19, 2024 8:06 AM IST
NZ vs WI|ఉత్కంఠ పోరులో విండీస్‌పై నెగ్గి ఫైన‌ల్‌కి చేరిన కివీస్ .. చివ‌రి ఫైట్‌లో సాతాఫ్రికాతో ఢీ

NZ vs WI| యూఏఈ వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్ కప్(T20 world cup) స‌మ‌రం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ టోర్నీ మొద‌టి నుండి చాలా ర‌స‌వత్త‌రంగా సాగుతూ వ‌చ్చింది. మొదటినుంచి దూకుడు ప్రదర్శించిన ఆస్ట్రేలియా ఫైనల్స్ అవకాశాలను చేజార్చుకోవ‌డం విశేషం. లీగ్ మ్యాచ్‌లో ఆధిప్యతాన్ని ప్రదర్శించిన ఆసీస్ సెమీస్‌కు చేరినప్పటికీ.. దక్షిణాఫ్రికా(South Africa) జట్టు కంగార్లకు ఝలక్ ఇవ్వ‌డంతో వారు ఇంటి బాట ప‌ట్టారు.ఇక మ‌రో సెమీ ఫైన‌ల్(Final) మ్యాచ్ గ‌త రాత్రి జ‌ర‌గ‌గా, ఇది కూడా చాలా ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో కివీస్‌.. వెస్టిండీస్(West Indies) పై విజ‌యం సాధించి ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది.8 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమయ్యారు.

విండీస్‌ను గెలిపించేందుకు డియోండ్ర డాటిన్‌ బంతి (4/22)తో పాటు బ్యాట్‌ (22 బంతుల్లో 33, 3 సిక్సర్లు)తోనూ పోరాడినా ఫైన‌ల్‌కి చేర్చ‌లేక‌పోయింది.తొలుత కివీస్‌ 20 ఓవర్లలో 128/9 స్కోరు చేసింది. జార్జ్‌ ఫ్లిమ్మర్‌ (33), సుజీ బేట్స్‌ (26), ఇసబెల్లా గేజ్‌ (20) కాస్త ప‌రుగులు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. డాటిన్‌ 4, ఫ్లెచర్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 120/8 స్కోరుకే పరిమితమైంది. బౌలింగ్‌లో అదరగొట్టిన డాటిన్‌ (33) మెరుపు బ్యాటింగ్‌తో పోరాడింది. అయితే 17వ ఓవర్లో డాటిన్‌ అవుటవడంతో మ్యాచ్‌ కివీస్‌(New Zealand)వైపు మొగ్గింది. ఆపై ఫ్లెచర్‌ (17 నాటౌట్‌), జైడా (14) విండీస్‌ను గెలిపించేందుకు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేసిన కూడా సాధ్యం కాలేదు.

న్యూజిలాండ్ బౌల‌ర్స్‌లో కార్సన్‌ 3, కెర్‌ 2 వికెట్లు తీశారు. ఇక.. ఆదివారం జరిగే ఫైనల్లో(Final) దక్షిణా ఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి.మ‌రి ఈ రెండు జ‌ట్ల‌లో ఎవ‌రు గెలిచి స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తారో చూడాలి. రేపు ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రెండు సార్లు ఫైనల్స్ చేరినప్పటికీ కప్ గెలవని న్యూజిలాండ్ ఈ సారి కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది. మ‌రోవైపు ద‌క్షిణాఫ్రికా(South Africa) కూడా అంతే క‌సితో ఉంది.