IPL ‘రంగోన్ కా ఖేల్ 2.0’ ప్రచారం ప్రారంభం

  • By: sr    sports    Apr 11, 2025 4:57 PM IST
IPL ‘రంగోన్ కా ఖేల్ 2.0’ ప్రచారం ప్రారంభం

ముంబై: IPL 2025 కోసం ‘రంగోన్ కా ఖేల్ 2.0’ అనే ప్రచారాన్ని ప్రారంభమైంది. గత ప్రచార విజయాన్ని మరింత ఉన్నతంగా నిలిపే ఈ కొత్త ప్రచారం రంగులు, సమాజ స్ఫూర్తి, ప్రముఖ వ్యక్తుల సమన్వయంతో సినిమాటిక్ ఉత్సవ అనుభవాన్ని, క్రికెట్‌లోని ఉత్తేజకర స్ఫూర్తిని అందజేస్తుంది. ఈ ప్రచార చిత్రం పిల్లల గల్లీ క్రికెట్ మ్యాచ్‌తో ఆరంభమవుతుంది. క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, మిథాలీ రాజ్ ఊహించని ఆగమనంతో కథ ఉత్కంఠభరితంగా మలుపు తిరుగుతుంది. ‘రంగోన్ కా ఖేల్ హై’ అనే గీతం హృదయ స్పందనగా నిలిచి, పిల్లలు, పెద్దలు, క్రికెట్ దిగ్గజాలు ఒక్కటై, IPL, WPL జట్లను సూచించే రంగులతో ఆ ప్రాంతాన్ని సంతోషకరంగా మారుస్తారు.

విభిన్న రంగుల శ్రేణి నుండి స్ఫూర్తి పొందిన ఈ గీతం ఆనందం, ఐక్యత, ఆటను అద్భుతంగా చేసే భావోద్వేగాలను ప్రతిఫలిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లలో ఎనిమిది జట్లతో జేఎస్‌డబ్ల్యూ భాగస్వామ్యం కలిగి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో పాటు WPLలో గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, UP వారియర్జ్ జట్లతో సహకారం కలిగి ఉంది.

JSW పెయింట్స్ జాయింట్ ఎండీ & సీఈవో సుందరేశన్ మాట్లాడుతూ.. “క్రికెట్ నేడు రంగులు, భావోద్వేగాలతో కూడిన ఉత్సవంగా మారింది. ‘రంగోన్ కా ఖేల్ 2.0’ ద్వారా లక్షలాది క్రికెట్ అభిమానులతో మా అనుబంధం బలోపేతమవుతుంది. క్రికెట్ దిగ్గజాలు, సమాజ స్ఫూర్తి, మా శక్తివంతమైన రంగుల శ్రేణితో, రంగులు ఏ స్థలాన్నైనా ఆలోచనాత్మకంగా అందంగా మార్చగలవని చూపించాలనుకున్నాము” అని పేర్కొన్నారు.