RCB vs CSK| బ్యాటు క్రీజులో పెట్టినా కూడా డుప్లెసిస్ ఔట్ అని ఎందుకు ప్రకటించారు..!
RCB vs CSK| అసలు ఫస్టాఫ్‌లో ఆర్సీబీ ఆట తీరు చూసిన ఎవరైన వారు ప్లేఆఫ్స్‌కి వస్తారని ఊహిస్తారా.. ఆ జట్టే ముందు నాకౌట్ అవుతుందని అనుకుంటారు. కాని అన్ని తలకిందులు చేస్తూ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరింది ఆర్సీబీ జట్టు. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో అందరు సమిష్టిగా ఆడి చెన్నైపై 27 పరుగుల తేడాతో గెలిచారు. దీంతో ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్‌కి చేరింది. ప్లేఆఫ్స్ చేరాలంటే బెంగళూరు తప్పకుండా కనీసం 18 పరుగుల తేడాతో మ్యాచ్ గెల
RCB vs CSK| అసలు ఫస్టాఫ్‌లో ఆర్సీబీ ఆట తీరు చూసిన ఎవరైన వారు ప్లేఆఫ్స్‌కి వస్తారని ఊహిస్తారా.. ఆ జట్టే ముందు నాకౌట్ అవుతుందని అనుకుంటారు. కాని అన్ని తలకిందులు చేస్తూ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరింది ఆర్సీబీ జట్టు. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో అందరు సమిష్టిగా ఆడి చెన్నైపై 27 పరుగుల తేడాతో గెలిచారు. దీంతో ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్‌కి చేరింది. ప్లేఆఫ్స్ చేరాలంటే బెంగళూరు తప్పకుండా కనీసం 18 పరుగుల తేడాతో మ్యాచ్ గెలవాల్సి ఉండగా, వారు 27 పరుగుల తేడాతో గెలవడంతో ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టారు. ఆర్సీబీ బ్యాట్స్‌మెన్స్‌లో కెప్టెన్ డుప్లెసిస్ ( 39 బంతుల్లో 54, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 47, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్ పటీదార్ (23 బంతుల్లో 41, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరూన్ గ్రీన్ ( 17 బంతుల్లో 38, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడడంతో మంచి స్కోరు సాధించారు.

అయితే అద్భుతంగా ఆడుతున్న డుప్లెసిస్ ఔట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో భాగంగా 13వ ఓవర్ మిచెల్ శాంట్నర్ వేస్తున్నాడు. అయితే చివరి బంతిని రజత్ పటీదార్ స్ట్రైట్‌గా కొట్టాడు.బంతి శాంట్నర్ చేతివేళ్లను తాకి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్స్ తాకింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్‌లు రనౌట్‌కు అప్పీల్ చేయగా,ఫీల్డ్ అంపైర్స్ థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేశారు. రీప్లే చూస్తే డుప్లెసిస్ తన బ్యాట్‌ని ఆ సమయానికి క్రీజులో పెట్టినట్టే కనిపించింది. దీంతో అంతా డుప్లెసిస్ నాటౌట్ అనుకున్నారు. ఇక డుప్లెసిస్ కూడా నెక్స్ట్ బాల్ కోసం రెడీ అయ్యాడు. అయితే పలుమార్లు చెక్ చేసిన డుప్లెసిస్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు.
బంతి వికెట్స్‌ని తాకే సమయంలో డుప్లెసిస్ బ్యాట్ క్రీజులోనే ఉన్నా అది గ్రౌండ్‌ను టచ్ చేయలేదని, గాల్లో ఉందంటూ థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఇది చూసి డుప్లెసిస్ సహా ఆర్సీబీ అభిమానులు షాకయ్యారు. సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అది క్లియర్‌గా నాటౌట్ కాగా, .. అంపైర్ తప్పుడు నిర్ణయానికి మంచిగా ఆడుతున్న డుప్లెసిస్ బలయ్యాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైన ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్‌కి వెళ్లింది కాబట్టి ఇది పెద్ద రచ్చ కాకపోవచ్చు. ఓడిపోయి ఉంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది.
Mitchell Santner dismissed Virat Kohli and ran out Faf Du Plessis at the non striker’s end.
– A great spell from Santner!pic.twitter.com/CwYo5fPI6t
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram