Rohit Sharma|రోహిత్ రిటైర్మెంట్‌కి సమయం ఆసన్నమైంది.. అదే చివరి మ్యాచ్ అంటున్న మాజీ కెప్టెన్
Rohit Sharma|ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ వైట్ వాష్ కావడం తొలిసారి కావడంతో దీనిపై తీవ్ర విమర్శలు వెల్లు

Rohit Sharma|ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ వైట్ వాష్ కావడం తొలిసారి కావడంతో దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సిరీస్ మొత్తం రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన కనబరచడంతో వారిని అలానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సొంత గడ్డపై 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121 పరుగులకే కుప్పకూలి దారుణంగా ఓటమి పాలు కావడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
మూడు టెస్ట్‌ల సిరీస్‌లో కనీసం ఒకటైన గెలిచి పరువు నిలబెడతారని అనుకుంటే దారుణమైన ఆటతో చిరాకు తెప్పించారు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణంగా విఫలమయ్యారు. కోహ్లి 15.50 సగటుతో కేవలం 93 పరుగులే చేశాడు. ఇక రోహిత్ 15.16 సగటుతో 91 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని చాలా మంది సూచిస్తున్నారు. 36 ఏళ్ల కోహ్లి, 37 ఏళ్ల రోహిత్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరలో ఉందని ఎవరికి నచ్చినట్టు వారు జోస్యాలు చెబుతున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వారి రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ శర్మ విఫలమైతే, ఆ సిరీస్‌లో చివరి మ్యాచే రోహిత్‌కు ఆఖరి టెస్టు అవుతుందని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అన్నాడు. రోహితే స్వయంగా టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటాడని పేర్కొన్నాడు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ ఇకపై వన్డేల్లోనే కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు. రోహిత్ వయస్సుని కూడా మనం దృష్టిలో ఉంచుకోవల్సిన అవసరం ఎంతైన ఉందని కూడా శ్రీకాంత్ పేర్కొన్నాడు. కివీస్ సిరీస్‌లో బ్యాటర్-కెప్టెన్‌గా విఫలమయ్యానని రోహిత్ అంగీకరించిన తీరును ఆయన మెచ్చుకున్నాడు. కాగా, రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా ఓపెనర్‌ను సిద్ధం చేయాలని బీసీసీఐకి సూచనలు చేశాడు.కివీస్ సిరీస్‌లో దారుణంగా ఓటమి చెందడంతో బీసీసీఐ కూడా రోహిత్‌పై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది.