Shreyas Iyer : ఐసీయూలో టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ !
ఆస్ట్రేలియా వన్డేలో గాయపడ్డ టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో చేరారు. పక్కటెముక గాయం, రక్తస్రావంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
న్యూఢిల్లీ : సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో క్యాచ్ పట్టే క్రమంలో కిందపడి తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వెనక్కి పరిగెడుతూ క్యాచ్ అందుకొనే క్రమంలో శ్రేయస్ అయ్యర్ బలంగా నేలను తాకాడు. దీంతో అతడి పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతడిని బీసీసీఐ వైద్యబృందం ఆసుపత్రికి తరలించింది. వైద్య పరీక్షల్లో రిబ్స్ లో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. దీంతో శ్రేయస్ ను మేనేజ్‌మెంట్ ఐసీయూలో చేర్చినట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. అయ్యర్ పక్కటెముకల్లో గాయమైందని.. వైద్య పరీక్షలో అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతడిని ఐసీయూలో చేర్చాం. కనీసం రెండు రోజుల నుంచి ఏడు రోజులపాటు అతడు అబ్జర్వేషన్‌లో ఉంటాడు. బ్లీడింగ్ ఆగిపోవడం, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే అప్పుడు తదుపరి చర్యలు తీసుకుంటాం అని తెలిపింది. టీమ్ వైద్యుడు, ఫిజియో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా శ్రేయస్‌ను ఆసుపత్రిలో చేర్చారు. లేకపోతే ప్రాణాల మీదకు వచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త నిలకడగానే ఉందని.. శ్రేయస్ దృఢమైన వ్యక్తి. తప్పకుండా త్వరలోనే కోలుకుని తిరిగి వస్తాడు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతర్గతంగా కనీసం మూడు వారాల పాటు అయ్యర్ ఆటకు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram