SRH vs KKR|సన్‌రైజర్స్‌పై గెలుపుతో ఫైనల్‌కి చేరిన కోల్‌కతా.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే కప్ ఎస్ఆర్‌హెచ్‌దే..!
SRH vs KKR| ఇన్నాళ్లు లీగ్ మ్యాచ్‌లతో ప్రేక్షకులు మంచి క్రికెట్ మజాని పొందగా, ఇక ఇప్పుడు అసలు సిసలైన గేమ్ మొదలైంది. గత రాత్రి నుండి ప్లేఆఫ్స్ మొదలు కాగా, అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ పోరులో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍ను కోల్కతా

SRH vs KKR| ఇన్నాళ్లు లీగ్ మ్యాచ్‌లతో ప్రేక్షకులు మంచి క్రికెట్ మజాని పొందగా, ఇక ఇప్పుడు అసలు సిసలైన గేమ్ మొదలైంది. గత రాత్రి నుండి ప్లేఆఫ్స్ మొదలు కాగా, అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ పోరులో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍ను కోల్‍కతా చిత్తు చేసి మంచి విజయం సాధించింది. 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్న శ్రేయస్ అయ్యర్ సేన డైరెక్ట్‌గా ఫైనల్‌కి చేరుకుంది. ఇలా ఆ జట్టు ఫైనల్‌కి చేరుకోవడం నాలుగోసారి. గతంలో 2012, 2014, 2021లో తుదిపోరుకు చేరిన కేకేఆర్ ఈ సారి కూడా ఫైనల్‌లో అడుగుపెట్టి టైటిల్ దక్కించుకోవాలని కసితో ఉంది.
2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఛాంపియన్‍గా నిలిచింది. ఇప్పుడు మూడో టైటిల్ లక్ష్యంగా మే 26న చెన్నై చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిన కూడా వారికి మరో అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు (మే 22) జరిగే ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మే 24న క్వాలిఫయర్-2లో హైదరాబాద్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిస్తేనే ఫైనల్‌కి చేరుకుంటుంది. లేదంటే మాత్రం ఇంటిబాట పట్టాల్సిందే. అయితే క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ తప్పక విజయం సాధించిన కప్ కొడుతుందని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ సెంటిమెంట్ రీపిట్ జరిగతే మాత్రం హైదరాబాద్‌దే టైటిల్ అంటున్నారు. 2015లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ గెలిచి,ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2016లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. ఇక 2023 వన్డే ప్రపంచకప్‌లోనూ ఆస్ట్రేలియానే ఛాంపియన్‌గా నిలిచింది కాబట్టి ఆ లెక్కన ఐపీఎల్ 2024 టైటిల్‌ను సన్‌రైజర్స్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. మరి ఇంతవరకు జరుగుతుందో చూడాలి. ఇక మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55) , హెన్రీచ్ క్లాసెన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), ప్యాట్ కమిన్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) మాత్రమే విలువైన పరుగులు చేశారు. ఇక కేకేఆర్ లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించారు.. వెంకటేశ్ అయ్యర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో తమ జట్టుకి మంచి విజయాన్ని అందించారు.