INDIA| నేడే టీమిండియా విజ‌యోత్స‌వ ర్యాలీ.. ఎప్పుడు,ఎక్క‌డ‌.. అతిథులు ఎవ‌రు?

INDIA| క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో క్రికెట్ ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు. భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాల‌ని 2011 నుండి ఫ్యాన్స్ ఎన్నో ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. అయితే వెస్టిండీస్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన ఫైనల్‌ పోరులో సఫారీలను ఓడించి 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌

  • By: sn    sports    Jul 04, 2024 7:24 AM IST
INDIA| నేడే టీమిండియా విజ‌యోత్స‌వ ర్యాలీ.. ఎప్పుడు,ఎక్క‌డ‌.. అతిథులు ఎవ‌రు?

INDIA| క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో క్రికెట్ ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు. భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాల‌ని 2011 నుండి ఫ్యాన్స్ ఎన్నో ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. అయితే వెస్టిండీస్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన ఫైనల్‌ పోరులో సఫారీలను ఓడించి 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని ఎగ‌రేసుకుపోయింది రోహిత్ సేన‌. ఆ స‌మ‌యంలో యావ‌త్ దేశం మురిసిపోయింది. ఆట‌గాళ్ల అనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అయితే క‌ప్ గెలిచిన వెంటనే టీమిండియా స్వదేశానికి రావాల్సి ఉండగా.. బార్బోడస్‌లోని భారీ తుఫాను కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. అయితే వారిని స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు ప్ర‌త్యేక విమానాన్ని పంపింది బీసీసీఐ. అయితే కొద్ది సేప‌టి క్రితం రోహిత్‌సేన దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.


ఈ రోజు ఉదయం 11 గంటలకు టీమిండియా ఆటగాళ్లతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం ప్రపంచకప్ గెలిచి ఆటగాళ్లను ప్రభుత్వం తరఫున సత్కరించనున్నారు.ఆ త‌ర్వాత ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో విజ‌యోత్స‌వ సంబ‌రాలు జ‌ర‌ప‌నున్న‌ట్టు బీసీసీఐ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇక వాఖండే స్టేడియంలో బీసీసీఐ ప్రకటించిన రూ.125కోట్ల ప్రైజ్‌మనీ అందజేయనున్నట్లు రాజీవ్‌ శుక్లా తెలిపారు. కార్యక్రమం పూర్తయ్యాక ప్రత్యేక విమానంలో ముంబయికి బయలుదేరుతారు. నారిమన్‌ పాయింట్‌ నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్‌ షో ఉంటుంది.

జట్టు, కోచ్‌, సహాయక సిబ్బందిని సత్కరించి.. బీసీసీఐ ప్రకటించిన రూ.125కోట్ల పారితోషకం అందజేస్తాం అని బీసీసీఐ సెక్రెటరీ జైషా సైతం ఈ విషయాన్ని ఇప్ప‌టికే ధ్రువీకరించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మెరైన్‌ డ్రైవ్‌ విజయోత్సవ ర్యాలీ ఉంటుందని.. వాఖండే స్టేడియంలో జరుపుకునేందుకు రావాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ధోనీ సారథ్యంలోని టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా ఇలానే ముంబైలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. అప్ప‌ట్లో వేల‌ది మంది అభిమానులు టీమిండియా ఆటగాళ్లున్న బస్సు వెంట నడుచుకుంటూ వ‌చ్చి పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు.