India vs Sri Lanka U19 : అండర్ -19 అసియా కప్..భారత్ లక్ష్యం 139
దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్‌లో శ్రీలంక భారత్ ముందు 139 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో యువ భారత్ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది.
విధాత : అండర్ -19 అసియా కప్ క్రికెట్ టోర్నీ సెమీ ఫైనల్ లో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముందు 139పరుగుల విజయ లక్ష్యం నిర్ధేశించింది.
వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్ ను 20 ఓవర్లకు కుదించగా..ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 8వికెట్లు కోల్పోలయి 138 పరుగులు చేసింది. లంక బ్యాటర్లు చమికా హీనతిగల (42), విమత్ దినసర (32), సెథ్మిక సెనెవీరత్నె (30) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్ 2, హెనిల్ పటేల్ 2, కిషన్ కుమార్, దీపేశ్, ఖిలాన్ పటేల్, ఒక్కో వికెట్ తీశారు.
139పరుగుల లక్ష్య చేధన ప్రయత్రంలో యువ భారత్ జట్లు ఆదిలోనే ఓపెనర్, కెప్టెన్ ఆయుష్ మాత్రే(7) వికెట్ నష్టపోయింది. వైభవ్ సూర్యవంశీ(1), ఆరోన్ జార్జే(8) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రెటీలకు ఈడీ షాక్..ఆస్తుల అటాచ్
TATA Sierra vs MG Hector : టాటా సియెర్రాకు ఎంజీ హెక్టార్ కౌంటర్ ఇచ్చేనా..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram