TATA Sierra vs MG Hector : టాటా సియెర్రాకు ఎంజీ హెక్టార్ కౌంటర్ ఇచ్చేనా..!

టాటా సియెర్రా రీ-ఎంట్రీతో ఆటోమొబైల్ మార్కెట్ షేక్ అవుతోంది. సియెర్రా దూకుడుకు బ్రేక్ వేసేందుకు ఎంజీ హెక్టార్ కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. మైలేజ్, ధరల్లో ఏది బెస్ట్? ఇక్కడ చూడండి.

TATA Sierra vs MG Hector : టాటా సియెర్రాకు ఎంజీ హెక్టార్ కౌంటర్ ఇచ్చేనా..!

విధాత : టాటా మోటార్స్ ఐకాన్ బ్రాండ్ టాటా సియెర్రా కారు రీ ఎంట్రీలో న్యూవర్షన్ రిలీజ్ కాగా..కస్టమర్లు ఈ కారు కోసం ఎగబడుతున్నారు. తొలి 24గంటల్లోనే 70వేల బుకింగ్స్..మరో 1.35లక్షల మంది కాన్ఫిగరేషన్ చేసుకున్న తీరు సియెర్రా అమ్మకాల రైజింగ్ ను చాటుతుంది. మార్కెట్ లో టాటా సియెర్రా దూకుడుకు బ్రేక్ వేసేందుకు మారుతి, కియా, ఎంజీ హెక్టార్, రేనాల్ట్, నిస్సాన్ సంస్థలు గట్టి ప్రయత్రాలే చేస్తున్నాయి. సియెర్రా న్యూ వర్షన్ కు పోటీగా కియా సెల్టోస్ ఫేస్ లిఫ్టును విడుదల చేసింది. నిస్సాన్ తాజాగా గ్రావైట్ పేరుతో ఏడుసీట్ల మల్టీ పర్పస్ కారును విడుదల చేసింది. త్వరలోనే మిడ్ సైజ్ ఎస్ యూవీ టెక్టన్ కారును తీసుకరాబోతుంది. మారూతి మోటార్స్ విక్టరీస్ ను లాంచ్ చేసింది. రేనాల్ట్ మోటార్స్ వారి ఐకాన్ కారు డస్టర్ తిరిగి ప్రవేశ పెడుతూ.. జనవరి 26 న్యూవర్షన్ లాంచ్ చేయబోతుంది. హ్యూండాయ్ నుంచి క్రేటా, వేన్యూ, టయోటా నుంచి హైరైడర్, హోండా నుంచి ఎలివెట్, మహింద్రా నుంచి స్కార్పియో కార్లు మార్కెట్ లో ఉన్నాయి. స్కోడా నుంచి కుషాక్, వోక్స్ వ్యాగన్ నుంచి టిగాన్ రేసులో ఉన్నాయి.

ఎంజి హెక్టర్ మోటార్స్ మాత్రం సియోర్రాకు పోటీగా ఇప్పుడు తన హెక్టార్ కారు న్యూ మోడల్ ను రిలీజ్ చేసింది. ఇందులో టాటా సియెర్రా కొనాలా? లేక హెక్టార్ కొనాలా అనే ఆలోచనను కారు కొనుగోలు దారుల ముందుకు తీసుకవచ్చింది. టాటా సియెర్రా ప్రారంభ ధర రూ.11.49లక్షలతో మొదలవుతుండగా..హెక్టార్ న్యూ మోడల్ కూడా రూ.11.99లక్షలతో అందుబాటులోకి తీసుకొచ్చారు.

సియెర్రా, హెక్టార్ రెండు మోడళ్లను వాటి ధర, పరిమాణం, స్థలం, బూట్ స్థలం, సర్వీస్ ధర, మైలేజ్, ఫీచర్లు, రంగులు,ఇతర స్పెసిఫికేషన్ల వారిటి సరిపోల్చుకుని కొనుగోలు దారులు నిర్ణయం తీసుకోవచ్చు. మైలేజ్ విషయానికొస్తే, హెక్టర్ 13.79 kmpl (పెట్రోల్ టాప్ మోడల్) మైలేజీని కలిగి ఉండగా.. సియర్రా 29.9 kmpl (పెట్రోల్ టాప్ మోడల్) మైలేజీని కలిగి ఉన్నది. కొత్త కారు కొనాలనుకునే వారు మార్కెట్ లో మిడ్ సైజ్ ఎస్ యూవీల మోడల్స్ లో స్పెసిఫికేషన్లు, ధరలు, ఫీచర్లు, మైలేజ్ చూసుకుని నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Ponnam Prabhakar : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.806.35 రాయితీ
Australia vs England : హెడ్ సూపర్ సెంచరీ..ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యత