Vaibhav Suryavanshi : అండర్ -19 ఆసియా కప్‌ కు వైభవ్ సూర్యవంశీ

అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ ఎంపికై సంచలనం సృష్టించాడు. డిసెంబర్ 12 నుంచి టోర్నీ ప్రారంభం.

Reported by: Tejaswini Nanna | క్రీడలు | Nov 28, 2025, 4:26 pm IST
Read Time: 3 mins
Vaibhav Suryavanshi : అండర్ -19 ఆసియా కప్‌ కు వైభవ్ సూర్యవంశీ

విధాత : దుబాయ్ వేదికగా డిసెంబర్ 12నుంచి 21వరకు జరుగనున్న అండర్ -19 ఆసియా కప్‌ కు అడనున్న భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత్ అండర్-19 టీమ్ కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. కెప్టెన్ గా ఆయుష్‌ మాత్రే, వైస్ కెప్టెన్ గా విహాన్‌ మనోజ్‌ మల్హోత్రా నియామితులయ్యారు. వచ్చే ఏడాది జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగునున్న అండర్-19 వరల్డ్ కప్ కు సన్నాహంగా అండర్‌-19అసియాకప్ టోర్నీ భారత్ కు ఉపయోగపడనుంది. ఇటీవల రైజింగ్ స్టార్స్ అసియా కప్ లో అద్బుత సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ లను అభిమానులు అండర్-19 అసియా కప్ లోనూ చూడబోతున్నారు.

అండర్‌ -19 ఆసియా కప్‌ భారత జట్టు: ఆయుష్‌ మాత్రే (కెప్టెన్‌), విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్‌ కుందు (వికెట్‌ కీపర్‌), హర్వంశ్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), యువరాజ్‌ గోహిల్‌, కాన్షిక్‌ చౌహాన్‌, ఖిలాన్‌ ఎ.పటేల్‌, నమన్‌ పుష్పక్‌, డి.దీపేశ్‌, హెనిల్‌ పటేల్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌, ఉద్దవ్‌ మోహన్‌, అరోన్‌ జార్జ్‌

స్టాండ్‌ బైలు: రాహుల్‌ కుమార్‌, హేమ్‌చు దేశన్‌ జె, బీకే కిషోర్, ఆదిత్య రావత్

ఇవి కూడా చదవండి :

MLC Kavitha | కుట్రలో భాగంగా నన్ను కుటుంబం నుంచి దూరం చేశారు : కవిత
Former Naxalite Murder : మాజీ నక్సలైట్ ప్రాణం తీసిన యూ ట్యూబ్ చానల్ ఇంటర్య్వూ