Virat Kohli | షాకింగ్ న్యూస్‌: టెస్టు క్రికెట్‌కు విరాట్ గుడ్ బై

మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో దీని నుంచి వైదొలుగుతున్నా. వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కన్పిస్తుంది. ప్రేమతో ఇక సైనింగ్‌ ఆఫ్‌..’’ అని కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చాడు.

Virat Kohli | షాకింగ్ న్యూస్‌: టెస్టు క్రికెట్‌కు విరాట్ గుడ్ బై

Virat Kohli | భారత స్టార్ క్రికెటర్..మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని ముందుగానే బీసీసీఐకి చెప్పాడు. అయితే ఇప్పుడే వద్దని బీసీసీఐ చెప్పింది. కానీ విరాట్ కోహ్లీ తన నిర్ణయానికే కట్టుబడ్డాడు. తన రిటైర్మెంట్ అంశాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాడు. బీసీసీఐ కోహ్లీ నిర్ణయానికి అంగీకారం తెలియచేయడంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. టెస్టు క్రికెట్ కు ఎక్స్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఈ సందర్భంగా భావోద్వేగ పూరితంగా స్పందించారు. క్రికెట్‌లో నేను మొదటిసారి బ్యాగీ బ్లూ జెర్సీ ధరించి 14 సంవత్సరాలు అయిందని.. గుర్తు చేసుకున్నారు. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ తనను ఈ స్థాయికి తీసుకు వస్తుందని అసలు ఊహించలేదన్నారు. ఎన్నో కఠినసవాళ్లు, విజయాలతో జీవిత పాఠాలను నేర్పిందన్నారు. తెల్ల డ్రెస్ లో ఆడటం ఓ అనుభూతి అన్నారు. ఈ ఫార్మాట్ నుండి నేను వైదొలగాలనుకున్నప్పుడు ఇది సులభం కాదు అనిపించిందన్నారు. అయితే రిటైర్మెంట్ కు ఇప్పుడు సరైన సమయమని తెలిపారు. తన టెస్టు కెరీర్ లోని ప్రతి క్షణాన్ని ఎప్పటికీ ఆనందంగా గుర్తు చేసుకుంటానని తెలిపారు. నేను ఆశించిన దానికంటే ఎక్కువే ఇది నాకు తిరిగి ఇచ్చిందన్నారు. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో దీని నుంచి వైదొలుగుతున్నా. వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కన్పిస్తుంది. ప్రేమతో ఇక సైనింగ్‌ ఆఫ్‌..’’ అని కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చాడు. టీ 20ప్రపంచ్ కప్ విజయం తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మలు ఒకేసారి టీ 20లకు గుడ్ బై చెప్పారు. రోహిత్ శర్మ తాజాగా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా..ఆ వెంటనే కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

2011 జూన్ 20న జమైకా కింగ్ స్టన్ వేదికగా వెస్టిండీస్ తో మ్యాచ్ తో టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టి 123 టెస్టులు ఆడిన కోహ్లీ 9230 పరుగులు చేశారు. 7 డబుల్ సెంచరీలు, 30 సెంచరీలు, 31హాఫ్
సెంచరీలు సాధించారు. ఫస్ట్ టెస్టు సెంచరీ(116) 2012జనవరిలో అడిలైడ్ లో అస్ట్రేలియాపై చేశాడు. కేరిర్ లో అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోర్ 254పరుగులు. పదివేల పరుగులు సాధించాకే రిటైర్మెంట్ ప్రకటిస్తారనుకున్న అభిమానులకు కోహ్లీ నిర్ణయం షాక్ ఇచ్చింది. కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించి, 40 విజయాలు అందించాడు. ఇది 58.82 విజయ శాతంతో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు.