Paris Olympics 2024|ముగిసిన పారిస్ ఒలంపిక్స్.. భార‌త్ ఖాతాలో ఎన్ని, అత్య‌ధికంగా ఏ దేశానికి మెడ‌ల్ వ‌చ్చాయి?

Paris Olympics 2024| గ‌త కొన్ని రోజులుగా పారిస్ ఒలంపిక్స్ చూడ‌ముచ్చ‌ట‌గా సాగాయి. మూడు వారాల పాటు క‌నులవిందు క‌లిగించాయి. ఆగ‌స్ట్ 11తో ఎండ్ కార్డ్ పడింది . అంతర్జాతీయ పోటీల్లో ఈ సారి భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు బ‌రిలోకి దిగ‌గా అంద‌రు కూడా త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆకట్టుకున్నారు.

  • By: sn    sports    Aug 12, 2024 7:56 AM IST
Paris Olympics 2024|ముగిసిన పారిస్ ఒలంపిక్స్.. భార‌త్ ఖాతాలో ఎన్ని, అత్య‌ధికంగా ఏ దేశానికి మెడ‌ల్ వ‌చ్చాయి?

Paris Olympics 2024| గ‌త కొన్ని రోజులుగా పారిస్ ఒలంపిక్స్ చూడ‌ముచ్చ‌ట‌గా సాగాయి. మూడు వారాల పాటు క‌నులవిందు క‌లిగించాయి. ఆగ‌స్ట్ 11తో ఎండ్ కార్డ్ పడింది . అంతర్జాతీయ పోటీల్లో ఈ సారి భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు బ‌రిలోకి దిగ‌గా అంద‌రు కూడా త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆకట్టుకున్నారు. ఈసారి పతకాల సంఖ్య గతంలో (2020లో 7 పతకాలు) క‌న్నా ఒక‌టి త‌క్కువ‌నే. మొత్తంగా భార‌త్ ఆరు ప‌త‌కాలు సాధించ‌గా, అందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి. అయితే పతకాల సంఖ్య అటుంచితే ఒలింపిక్స్‌లో మనోళ్లు పలు కొత్త రికార్డులు నెల‌కొల్పి చ‌రిత్ర సృష్టించ‌డం విశేషం.

పారిస్ ఒలింపిక్స్ 2024 ముగియ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి లాస్ ఏంజెల్స్‌లో జ‌ర‌గ‌బోయే విశ్వ క్రీడ‌లపై ఉంది. 2028 ఒలింపిక్స్​ క్రీడలు జరగనుండ‌గా, పారిస్ ముగింపు వేడుకల్లో ఐవోసీ ప్రెసిడెంట్ థామస్ ఒలింపిక్ పతకాన్ని లాస్ఏంజెలెస్ మేయర్​ కారెన్​కు అందించారు. 2028లో ఒలంపిక్స్‌ని మ‌రింత ఘ‌నంగా నిర్వ‌హించేందుకు అమెరికా ఇప్ప‌టి నుండే క‌స‌ర‌త్తులు చేస్తుంది. ఈ సారి క్రికెట్‌ని కూడా ఒలంపిక్స్‌లో చేర్చ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. 2028 జులై 14న ప్రారంభమయ్యే ఈ ఒలింపిక్స్‌ క్రీడలు జులై 30న ముగుస్తాయి. ఒలింపిక్స్​లో 1900సంవత్సరంలో చివరిసారిగా క్రికెట్ జర‌గ‌గా, ఇప్పుడు లాస్‌ఏంజెలెస్‌లో క్రికెట్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. విశ్వ క్రీడల్లో టీ20 ఫార్మాట్​లో క్రికెట్ జరగనుంది.

ఇక ఈ సారి జ‌రిగిన ఒలంపిక్స్‌లో అమెరికా మొత్తం 126 ప‌త‌కాల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఇందులో 40 స్వ‌ర్ణాలు, 44 ర‌జ‌తాలు, 42 కాంస్యాలు ఉన్నాయి. ఇక చైనా 91 ప‌త‌కాలాతో రెండో స్థానంలో ఉంది.వారికి 40 స్వ‌ర్ణాలు, 27 ర‌జ‌తాలు,24 కాంస్యాలు ఉన్నాయి. రాబోయే ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి IOC ఐదు నగరాలను ఎంపిక చేసింది. 2026 వింటర్ ఒలింపిక్స్‌కు మిలన్ కోర్టినా డి’అంపెజ్జో, 2028 సమ్మర్ ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెల్స్ , 2030 వింటర్ ఒలింపిక్స్‌కు ఫ్రెంచ్ ఆల్ప్స్, 2032 సమ్మర్ ఒలింపిక్స్‌కు బ్రిస్బేన్, 2034 వింటర్ ఒలింపిక్స్ కోసం ఆస్ట్రేలియా, సాల్ట్ లేక్ సిటీని ప్రకటించారు.