Dog worship | ఆ గుడిలో శునకమే భగవంతుడు.. వందేళ్లుగా పూజలు.. ఎక్కడంటే..!
Dog worship : సాధారణంగా చాలామంది కుక్కలను చూస్తే చీదరించుకుంటారు. అవి దగ్గరికి రాబోతే దూరం వెళ్లగొడుతారు. కానీ ఓ ఊరి వాళ్లు మాత్రం వందేళ్లుగా కుక్కను పూజిస్తున్నారు. ఇంతకూ ఎవరు వాళ్లు..? ఏ ఊరి వాళ్లు..? అని ఆలోచనలో పడ్డారా..? అయితే అక్కడికే వస్తున్నా.

Dog worship : సాధారణంగా చాలామంది కుక్కలను చూస్తే చీదరించుకుంటారు. అవి దగ్గరికి రాబోతే దూరం వెళ్లగొడుతారు. కానీ ఓ ఊరి వాళ్లు మాత్రం వందేళ్లుగా కుక్కను పూజిస్తున్నారు. ఇంతకూ ఎవరు వాళ్లు..? ఏ ఊరి వాళ్లు..? అని ఆలోచనలో పడ్డారా..? అయితే అక్కడికే వస్తున్నా. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో గల ఒక బైరవుని ఆలయంలో ఈ శునక పూజలు జరుగుతున్నాయి. ఆ ఆలయంలోని శునకం విగ్రహాన్ని పూజించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆ శునకం విగ్రహం పాదాలకు నల్లదారం కట్టి ఏదైనా కోరుకుంటే అది జరిగి తీరుతుందని భక్తుల విశ్వాసం.
శునకాన్ని ఎందుకు పూజిస్తున్నారు..?
దాదాపు 100 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షెహర్‌లోని సికందరాబాద్‌లో బాబా లటూరియా అనే ఒక గురువు ఉండేవారు. మంచిచెడు అడిగేందుకు ఆయన దగ్గరికి చాలా మంది వస్తుండేవారు. ఆ క్రమంలోనే ఆయన ఆ ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో ఉంటూ ఆయన ఒక కుక్కను పెంచుకున్నారు. ఆ కుక్కను ఆయన ప్రేమగా బైరవ్ బాబా అని పిలుచుకునేవారు. దాంతో స్థానికులు కూడా ఆ శునకాన్ని అదే పేరుతో పిలిచేవారు.
అయితే, తన చివరి రోజుల్లో బాబా లటూరియా తాను నిర్మించుకున్న గుడిలోనే సజీవ సమాధికి సిద్ధమయ్యారు. బాబా సమాధిలోకి వెళ్లిన తర్వాత ఆయన భక్తులు దాన్ని మూసివేస్తుండగా బైరవ్ అందులోకి దూకింది. కానీ బాబా భక్తులు వెంటనే దాన్ని బయటికి తీసి సమాధిని మూసేశారు. ఆ తర్వాత కాసేపటికే బైరవ్ మరణించింది. దాంతో బైరవ్‌కు గుర్తుగా ఆ ఆలయంలో ఓ విగ్రహాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. ఏటా హోలీ, దీపావళి పండుగలకు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళ, శనివారాల్లో బైరవ్ దర్శనానికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.