Snaking News | స్మార్ట్‌ ఫోన్‌లో ఆ దృశ్యాలు చూస్తూ రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయిన పాము!

ఎలుకలను వేటాడి తిని బతికే పాము.. దాని ప్రాపంచిక జీవితం నుంచి తప్పించుకునేందుకు ఇలా వచ్చి ఫోన్‌లో పాటలు చూస్తున్నదేమో.. అని ఒకరు పేర్కొన్నారు. రాబోయే మానవ జన్మలో ఏం చేయాలో నేర్చుకుంటున్నట్టుంది.. అని మరొకరు రాశారు. మొత్తానికి రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడిన పాముతో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు.

Snaking News | స్మార్ట్‌ ఫోన్‌లో ఆ దృశ్యాలు చూస్తూ రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయిన పాము!

Snaking News | పాములు పొదల్లో లేదంటే ఇళ్ల చూర్లలో, ఇంట్లోని వస్తువుల కింద పట్టుబడుతుంటాయి. కానీ.. ఈ పాము మాత్రం టీవీ చూస్తూ రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడింది. ఈ ఏడాది విచిత్రం అనిపించేలా ఉన్న ఈ ఘటనను ఎక్స్‌ హ్యాండ్లర్‌ ఒకరు షేర్‌ చేశారు. దానిని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకోవడంతోపాటు.. ఫన్నీగా కామెంటుతున్నారు.

వీడియో ప్రారంభంలో ఒక పాము.. తోక నుంచి కనిపిస్తుంది. తల భాగానికి వచ్చేసరికి ఏదో చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏం చూస్తున్నదోనని ఆలోచించేలోపే .. ఎదురుగా ఒక స్మార్ట్‌ ఫోన్‌లో మంచి రసవత్తరమైన పాట వీడియోను తదేకంగా చూస్తూ కనిపిస్తుంది. అందులో హీరోయిన్‌ హొయలొలికిస్తూ ఉంటంటే.. కనీసం కదలకుండా కళ్లను ఫోన్‌ కట్టేసినట్టు పాము దానిని చూస్తున్న దృశ్యం చూసిన నెటిజన్లు.. ఇది ‘దొంగ పాము’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కొంత మంది విభిన్నంగా స్పందించారు. పాటలో హీరోయిన్‌ డ్రస్‌కు పాము బాగా కనెక్ట్‌ అయినట్టు ఉంది.. అని కొందరు రాశారు. ఎలుకలను వేటాడి తిని బతికే పాము.. దాని ప్రాపంచిక జీవితం నుంచి తప్పించుకునేందుకు ఇలా వచ్చి ఫోన్‌లో పాటలు చూస్తున్నదేమో.. అని ఒకరు పేర్కొన్నారు. రాబోయే మానవ జన్మలో ఏం చేయాలో నేర్చుకుంటున్నట్టుంది.. అని మరొకరు రాశారు. మొత్తానికి రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడిన పాముతో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు.

ఇవి కూడా చదవండి..

Snake Dens | దాదాపు లక్షన్నర పాములు ‘కలిసే’ అతిపెద్ద ‘పాముల జాత‌ర’ ఎక్కడో తెలుసా?
Snakes: పాములు ఏ సమయంలో నిద్రిస్తాయి.. ఏ సమయంలో యాక్టివ్ గా ఉంటాయి.. ?
The strangest snake : నీలి సర్పం.. ఇది ప్రపంచంలోనే వింతైన పాము..