Mahindra Thar Roxx | మహింద్ర 5 డోర్​ ఎస్​యూవీ థార్​ రాక్స్​ విడుదల : ఇవిగో ప్రత్యేకతలు, ధరలు

దేశవ్యాప్తంగా వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న  మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్‌ ఎస్‌యూవీ (Mahindra Thar ROXX 5-Door SUV) నేడు అధికారికంగా విడుదల అయ్యింది. ఆశ్చర్యకరంగా బేస్​ మాడల్​ను ఒక రోజు ముందే విడుదల చేసింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉన్న థార్​ రాక్స్​ను  నేడు ఆగస్టు 15న,  78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసి, మిగతా వేరియంట్లు, వాటి పూర్తి ఫీచర్లను వెల్లడించింది.

Mahindra Thar Roxx | మహింద్ర 5 డోర్​ ఎస్​యూవీ థార్​ రాక్స్​ విడుదల : ఇవిగో ప్రత్యేకతలు, ధరలు

 

మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ఎస్యూవీ (Mahindra Thar ROXX 5-Door SUV)  రూ .12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో బేస్‌ వేరియంట్‌ని ప్రకటించిన మహింద్రా అందరినీ  ఆశ్చర్యపరిచింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే థార్​ రాక్స్​,  పెట్రోల్ వేరియంట్ ధరలు రూ .12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), డీజిల్ వెర్షన్ ధరలు రూ .13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)నుంచి ప్రారంభం కానున్నాయి. బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. వాహన డెలివరీలు అక్టోబర్​లో  ప్రారంభమవనున్నట్లు తెలిసింది. థార్ రాక్స్ కోసం టెస్ట్ డ్రైవ్స్ సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. థార్ రాక్స్ వేరియంట్ల వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు, ఫీచర్ల వివరాలు మీకోసం..

మహీంద్రా థార్ రాక్స్ MX1: ఇది థార్‌ 5 డోర్‌లో బేస్ వేరియంట్‌. అయినప్పటికీ ఇందులోనూ మంచి ఫీచర్లను పొందుపరిచారు. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్, 18 ఇంచెస్‌ స్టీల్ వీల్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ స్టీరింగ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ చేయడానికి పుష్ బటన్, రియర్ ఏసీ వెంట్స్, USB-సీ పోర్ట్ ఉన్నాయి. టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 60:40 స్ప్లిట్ సీట్లు, సేఫ్టీ కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ప్రయాణీకులందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్స్‌ ఉన్నాయి. దీని పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ. 12.99 లక్షలు, డీజీల్‌ వేరియంట్ ధర రూ. 13.99 లక్షలుగా ఉంది. ఈ రెండు మ్యాన్‌వల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌తో వస్తాయి.

మహీంద్రా థార్ రాక్స్ MX3: ఈ వేరియంట్‌లో ఆర్మ్‌రెస్ట్​ విత్‌ కప్ హోల్డర్స్, డ్రైవింగ్ మోడ్స్, టెరైన్ మోడ్స్, అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ ఇంకా రియర్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. అంతే కాకుండా వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ IRVM, వైర్లెస్ ఛార్జర్ మరియు వన్-టచ్ పవర్ విండో కూడా ఉన్నాయి. భద్రత కోసం ఈ వేరియంట్లో ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు పెట్రోల్ AT వేరియంట్లో 4 డిస్క్ బ్రేకులు ఉన్నాయి. దీని పెట్రోల్ వేరియంట్‌ ధర రూ.14.99 లక్షలు, డీజిల్ వేరియంట్‌ ధర రూ.15.99 లక్షలుగా ఉంది. ఇది కూడా కేవలం మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌తోనే వస్తుంది.

మహీంద్రా థార్ రాక్స్ MX5: ఈ వేరియంట్లో సింగిల్ పేన్‌ సన్‌రూఫ్‌, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, LED ఫాగ్ ల్యాంప్స్, DRLs, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అకాస్టిక్ విండ్ షీల్డ్, లెదర్‌ కవర్డ్​ స్టీరింగ్ వీల్ మరియు సీట్లతో పాటు భద్రతా ప్రమాణాలు చాలా ఉన్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు వైపర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ వేరియంట్‌ నుంచి  మహీంద్రా థార్ రాక్స్ 4×4 డ్రైవ్​ మాడళ్లు కూడా రానున్నాయి. దీని ప్రారంభ ధర రూ.16.99 లక్షలు.

మహీంద్రా థార్ రాక్స్ AX3L: దీన్లోని ఫీచర్లు MX3 ​ లాగే ఉన్నాయి. ADAS, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డీటీఎస్ సౌండ్ స్టేజింగ్, 26.03 సెంటీమీటర్ల HD టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది కేవలం డీజిల్ ఇంజిన్, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ధర రూ.16.99 లక్షలు.

మహీంద్రా థార్ రాక్స్ AX5L: దీనిలో 26.03 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బిల్ట్ ఇన్ అలెక్సా, అడ్రినోఎక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో కూడిన డిజిటల్ క్లస్టర్‌తో AX5L రానుంది. పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డీటీఎస్ సౌండ్ స్టేజింగ్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వైర్‌లెస్‌ కనెక్టివిటీ, రక్షణ కోసం ADAS ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 18.99 లక్షలుగా ప్రకటించారు.

మహీంద్రా థార్ రాక్స్ AX7L: ఇది థార్​ రాక్స్​లో హైఎండ్​ మాడల్​. పనోరమిక్ సన్‌రూఫ్, 19 ఇంచెస్‌ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, లెథరెట్ కవర్డ్​ స్టీరింగ్ వీల్, సీట్లు ఇందులో రానున్నాయి. 80 కనెక్టెడ్​ సౌలభ్యాలతో అడ్రనాక్స్​ కనెక్ట్​ యాప్ అలాగే అడ్జస్టబుల్​ ఎలక్ట్రిక్ ఫ్రంట్-వెంటిలేటెడ్ సీట్లు, ఫ్రంట్ కెమెరా మరియు కూల్డ్ గ్లోవ్ బాక్స్ కూడా ఉంటాయి. బ్లైండ్ స్పాట్  కలిగిన 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా ఉన్నాయి.బఅంతే కాకుండా సబ్ వూఫర్‌తో హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, పవర్ ఫోల్డింగ్ ORVM, 65వాట్ USB ఛార్జర్ కూడా ఇందులో ఉండనున్నాయి. దీని ధర రూ. 18.99 లక్షలు.

మొట్టమొదటిసారిగా థార్​ సన్​రూఫ్​ను(Sunroof) రాక్స్​ మాడల్​తో పరిచయం చేస్తోంది. ఇవన్నీ ఏడు రంగులలో లభించనున్నాయి. స్టెల్త్​ బ్లాక్​, టాంగో రెడ్​, ఎవరెస్ట్​ వైట్​, బర్న్ట్​ సియోనా, బాటిల్​షిప్​ గ్రే, నెబ్యులా బ్లూ, డీప్​ ఫారెస్ట్​ వర్ణాలతో మెరవనున్నాయి.

ఇంతకుముందున్న మూడు డోర్ల వర్షన్​తో పోలిస్తే, రాక్స్​లో చాలా మార్పులు చేసారు. అందులో ఉన్న కంప్లయిట్లను ఇందులో సరిచేసి విడుదల చేసారు. వీటిలో ముఖ్యమైనది బూట్​ స్పేస్​. రాక్స్​లో 644 లీటర్ల స్పేస్​, పెద్ద టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటెయిన్​మెంట్​ వ్యవస్థ, 9 మెరుగైన శబ్దనాణ్యతను ఇవ్వగలిగిన స్పీకర్లు, ఆడాస్​ లెవెల్​ 2 భద్రతా ప్రమాణాలు థార్​ రాక్స్​లో ఉన్నాయి.