Tech tips | మీ స్మార్ట్‌ ఫోన్‌ లైఫ్‌ టైమ్‌ పెరగాలంటే ఈ మూడు చిట్కాలు పాటించండి..!

Tech tips : స్మార్ట్‌ఫోన్ (Smart Phone) వినియోగదారులు ఫోన్‌కు చార్జింగ్‌ (Phone charging) పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఫోన్‌లో బ్యాటరీ దెబ్బతినే ఆస్కారం ఉంది. ఫోన్‌ ఎక్కువకాలం పనిచేయాలంటే బ్యాటరీ పాడవకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం.

Tech tips | మీ స్మార్ట్‌ ఫోన్‌ లైఫ్‌ టైమ్‌ పెరగాలంటే ఈ మూడు చిట్కాలు పాటించండి..!

Tech tips : స్మార్ట్‌ఫోన్ (Smart Phone) వినియోగదారులు ఫోన్‌కు చార్జింగ్‌ (Phone charging) పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఫోన్‌లో బ్యాటరీ దెబ్బతినే ఆస్కారం ఉంది. ఫోన్‌ ఎక్కువకాలం పనిచేయాలంటే బ్యాటరీ పాడవకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఫోన్‌లకు చార్జింగ్‌ పెట్టే విషయంలో చాలామందికి కొన్ని చెడ్డ అలవాట్లు (Bad charging Habits) ఉంటాయి. ఆ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన ఫోన్‌ లైఫ్‌ టైమ్‌ను పెంచుకోవచ్చు. ఫోన్‌లో అత్యంత కీలకమైన పరికరం బ్యాటరీనే. కాబట్టి బ్యాటరీని కాపాడుకుంటే ఫోన్‌ను కాపాడుకున్నట్లే. బ్యాటరీని కాపాడుకోవాలంటే చార్జింగ్‌ పెట్టే విషయంలో కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా మూడు చెడు అలవాట్లను మానుకోవాలి. ఆ మూడు చెడు అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఫోన్‌ కేసులోనే చార్జింగ్‌ పెట్టడం

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో ఇది సర్వసాధారణమైన చెడు అలవాటు. ఇలా ఫోన్‌ను ఫోన్‌ కేసులోనే ఉంచి చార్జింగ్‌ పెట్టడం ద్వారా ముఖ్యంగా రెండు సమస్యలు ఉంటాయి. అందులో ఒకటి బ్యాటరీ హీటెక్కడం అయితే, రెండోది చార్జింగ్‌ కనెక్టర్‌ తెగిపోవడం. నాసిరకం మెటీరియల్‌తో తయారయ్యే ఫోన్‌ కేసులవల్ల చార్జింగ్‌ కేబుల్‌ రాపిడికి గురై క్రమంగా మొత్తానికే తెగిపోతుంది. కేస్‌లో ఉంచి చార్జింగ్‌ పెడితే ఫోన్‌ బాగా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కడంవల్ల చార్జింగ్‌ వేగం తగ్గుతుంది. అంతేగాక బ్యాటరీ జీవితకాలం కూడా తగ్గిపోతుంది. అందుకే ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టేటప్పుడు కేస్‌ను తొలగించకపోవడం అనే చెడు అలవాటును మానుకోవాలి.

2. రోజూ ఫాస్ట్ ఛార్జర్‌ వినియోగం

సాధారణంగా మనం స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు దాంతోపాటు వచ్చే చార్జర్‌లు ఫాస్ట్‌గా చార్జింగ్‌ అయ్యేవి ఉంటాయి. అయితే ప్రతిరోజూ ఈ ఫాస్ట్‌ చార్జర్‌లను వినియోగించడం కూడా చెడు చార్జింగ్‌ అలవాటు కిందే వస్తుంది. ఎందుకంటే కొత్త స్మార్ట్‌ఫోన్‌తో 40W లేదా అంతకంటే స్పీడ్‌ కలిగిన చార్జర్‌లు వస్తాయి. ప్రతిరోజూ ఈ చార్జర్‌లనే వినియోగిస్తే ఒత్తిడిపడి ఏడాదిలోపే ఫోన్‌లో బ్యాటరీ బాగా క్షీణిస్తుంది. అందుకే ఫాస్ట్‌ చార్జర్‌లకు బదులుగా బయట దొరికే నాణ్యమైన స్లో చార్జర్‌లను కొని వినియోగించడం ఉత్తమం. ఎప్పుడైనా వేగంగా చార్జింగ్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఫాస్ట్‌ చార్జర్‌లను వినియోగించుకోవచ్చు. కాబట్టి చార్జింగ్‌ కోసం రోజూ ఫాస్ట్‌ చార్జర్‌లను ఉపయోగించడం అనే చెడు అలవాటును మానుకోవాలి.

3. చార్జింగ్‌ 5 శాతం కంటే తగ్గడం

మీరు మీ స్మార్ట్‌ ఫోన్‌లో చార్జింగ్‌ 5% కంటే తగ్గేదాకా చూస్తున్నట్లయితే అది చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే ఇలా ఫోన్‌ చార్జింగ్ 5 శాతం కంటే దిగువకు పడిపోయినప్పుడు బ్యాటరీపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దాంతో బ్యాటరీ లైఫ్‌టైమ్‌ గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఫోన్‌ చార్జింగ్‌ 10 నుంచి 15% ఉన్నప్పుడే తిరిగి చార్జింగ్ పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి వీలుపడక ఫోన్‌లో చార్జింగ్‌ 5 శాతం దిగువకు పడిపోతే పర్వాలేదుగానీ, ప్రతిరోజూ 5 శాతానికి తగ్గేదాకా చూడటం బ్యాటరీకి మంచిది కాదు.