Iphone | ఐఫోన్ 13, 14, 15 సిరీస్ ధరలు తగ్గించిన యాపిల్
ఈ సంవత్సరపు ఐఫోన్ 16 సిరీస్ ప్రవేశానికి సమయం దగ్గర పడుతుండగా, భారత్‌లో ఐఫోన్ పాత సిరీస్ ఫోన్ల ధరలను యాపిల్ రూ.300 నుండి 6000 వరకు తగ్గించింది.

భారత్‌లో ఐఫోన్ల (iPhone)ధరలను యాపిల్ తగ్గించింది. కొత్త బడ్జెట్లో ఫోన్ల విడిభాగాలపై దిగుమతి సుంకాలను (Import Taxes) 20 నుండి 15 శాతానికి తగ్గించడంతో, తన భారత్ తయారీ ఐఫోన్ల ధరలను 3 నుండి 4( Prices reduced 3 to 4%) శాతం తగ్గించింది. ఈ మేరకు యాపిల్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, తగ్గింపు ధరలు బయటకొచ్చాయి. ఈ తగ్గింపు ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 13, 14, 15, 15ప్రొ మాడళ్లకు వర్తిస్తుంది. యాపిల్ తన ప్రస్తుత ప్రొ మాడల్‌కు ధర తగ్గించడం ఇదే మొదటిసారి.
మరోపక్క యాపిల్ ఐఫోన్ 16 ప్రొ, 16ప్రొ మ్యాక్స్ (iPhone 16 Pro, Pro Max)మాడళ్లను ఇండియాలో తయారుచేయనున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు చిన్న, బేస్ మాడళ్లను మాత్రమే భారత్‌లో తయారుచేస్తున్న యాపిల్, ప్రొ మాడళ్లను కూడా తయారుచేయాలని నిర్ణియించడానికి విడిభాగాల సుంకం తగ్గింపే కారణం కాబోతోంది. అదీ కాకుండా, కొత్త మాడళ్లను ప్రవేశపెడుతున్నప్పుడు పాత స్టాక్‌ను క్లియర్ (Old stock clearance) చేయడానికి కూడా ధరల తగ్గింపును ప్రకటించడం యాపిల్‌కు అలవాటు.
ఈ ధరల తగ్గింపు కింది విధంగా ఉంది.
ఐఫోన్ ఎస్ఈ(iPhone SE) రూ.49,900 నుండి రూ.47,600
ఐఫోన్ 13(iPhone 13) రూ.59,900 నుండి రూ.59,600
ఐఫోన్ 14(iPhone 14) రూ.69,900 నుండి రూ.69,600
ఐఫోన్ 14 ప్లస్(iPhone 14 Plus) రూ.79,900 నుండి రూ.79,600
ఐఫోన్ 15(iPhone 15) రూ.79,900 నుండి రూ.79,600
ఐఫోన్ 15 ప్లస్(iPhone 15 Plus) రూ.89,900 నుండి రూ.89,600
ఐఫోన్ 15 ప్రొ(iPhone 15 Pro) రూ.1,34,900 నుండి రూ.1,29,800
ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్(iPhone 15 Pro Max) రూ.1,59,900 నుండి రూ.1,54,000
ఈ ధరల తగ్గింపు ఇంకా యాపిల్ ఇండియా(www.apple.com/in/) వెబ్సైట్లో ప్రకటించలేదు. ప్రకటన రాగానే యాపిల్ రిటైల్ స్టోర్లు, డీలర్లు, ఆన్లైన్ మార్కెట్లో ధరలు తగ్గుతాయి. ఇదిలా ఉండగా, ఈ సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 రంగప్రవేశం చేస్తుంది. యాపిల్ తన ఈవెంట్లో ప్రకటించిన ఐఎస్18 ప్రకారం, ఐఫోన్ 16 విప్లవాత్మకమైన మార్పులతో రానుంది.