WhatsApp | మరో కొత్త ఫీచర్‌ పరిచయం చేయబోతున్న వాట్సాప్‌.. జీమెయిల్‌ తరహాలో ఈవెంట్‌ ఇన్విటేషన్స్‌ పంపొచ్చు..!

WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ కంపెనీ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తున్నది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. దాని సహాయంతో మీరు యాప్‌లో ఏదైనా ఈవెంట్‌ని ప్లాన్‌ చేసుకోవచ్చు. అదే సమయంలో ఈవెంట్‌ ఇన్విటేషన్లను సైతం పంపుకునేందుకు అవకాశం ఉంటుంది.

WhatsApp | మరో కొత్త ఫీచర్‌ పరిచయం చేయబోతున్న వాట్సాప్‌.. జీమెయిల్‌ తరహాలో ఈవెంట్‌ ఇన్విటేషన్స్‌ పంపొచ్చు..!

WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ కంపెనీ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తున్నది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. దాని సహాయంతో మీరు యాప్‌లో ఏదైనా ఈవెంట్‌ని ప్లాన్‌ చేసుకోవచ్చు. అదే సమయంలో ఈవెంట్‌ ఇన్విటేషన్లను సైతం పంపుకునేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి వాట్సాప్‌ గ్రూప్స్‌, కమ్యూనిటీస్‌ని దృష్టిలో పెట్టుకొని వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది.

వీకెండ్‌ పార్టీలు చేసుకునేవారికి, ఏదైనా ప్లాన్‌ను రూపొందించుకునే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనున్నది. కొత్త ఈవెంట్ ఫీచర్‌లో ట్రిప్‌లను రద్దు చేసుకోవాలనుకునే చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఏ రోజు ఎక్కడికి వెళ్లాలి ? జీమెయిల్‌ లాగా ప్రోగ్రామ్‌లో పాల్గొనే వారు అవును.. కాదు అనే సమాధానాలు సైతం ఇవ్వొచ్చు. అవును అని చెప్పిన స్నేహితులకు ఎప్పటికప్పుడు రిమైండర్స్‌ వెళ్తాయి. దాంతో ప్లాన్‌ని మరిచిపోకుండా ఉంటారు.

అలాగే యాత్రలో మీతో పాటు ఎవరెవరు వెళ్తాన్నారు? అనే వివరాలు సైతం ఉంటాయి. ఫీచర్‌లో వేరే గ్రూప్‌ సభ్యులు సైతం ప్రత్యుత్తరాలు పంపొచ్చు. దాంతో ఇలాంటి పరిస్థితుల్లో యాత్రకు ఎవరు వస్తున్నారో..? ఎవరు రావడం లేదో అందరికీ తెలుస్తుంది. జీమెయిల్‌లో ఇలాంటి ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులో ఉన్నది. ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్‌ కమ్యూనిటీస్‌ కోసం రూపొందించింది. రాబోయే రోజుల్లో గ్రూప్స్‌కి సైతం అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం ఫీచర్‌ను బీటా వెర్షన్‌లలో పని చేస్తున్నది. విజయవంతమైతే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నది.